వరల్డ్ కప్‌ ఫైనల్‌పై కోహ్లి స్పందన!

| Edited By:

Jul 16, 2019 | 8:18 PM

క్రికెట్‌ చరిత్రలోనే అద్భుతంగా నిలిచిపోయిన ఇంగ్లండ్‌-న్యూజిలాండ్ వరల్డ్ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌పై టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లి స్పందించాడు. నిబంధనల జోలికి పోకుండా ఇరు జట్ల పోరాటాన్ని కొనియాడుతూ ట్వీట్‌ చేశాడు. ‘ప్రపంచకప్‌ ఫైనల్లో ఇరు జట్లు అద్బుత పోరాటాన్ని కనబర్చాయి. ఇంగ్లండ్‌ జట్టుకు అభినందనలు’ అంటూ సాధాసీధాగా ట్వీట్‌ చేశాడు. ఈ ఫైనల్‌ మ్యాచ్‌, సూపర్‌ ఓవర్‌ రెండూ టై కావడంతో అత్యధిక బౌండరీలు సాధించిన ఇంగ్లండ్‌ను విశ్వవిజేతగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ […]

వరల్డ్ కప్‌ ఫైనల్‌పై కోహ్లి స్పందన!
Follow us on

క్రికెట్‌ చరిత్రలోనే అద్భుతంగా నిలిచిపోయిన ఇంగ్లండ్‌-న్యూజిలాండ్ వరల్డ్ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌పై టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లి స్పందించాడు. నిబంధనల జోలికి పోకుండా ఇరు జట్ల పోరాటాన్ని కొనియాడుతూ ట్వీట్‌ చేశాడు. ‘ప్రపంచకప్‌ ఫైనల్లో ఇరు జట్లు అద్బుత పోరాటాన్ని కనబర్చాయి. ఇంగ్లండ్‌ జట్టుకు అభినందనలు’ అంటూ సాధాసీధాగా ట్వీట్‌ చేశాడు. ఈ ఫైనల్‌ మ్యాచ్‌, సూపర్‌ ఓవర్‌ రెండూ టై కావడంతో అత్యధిక బౌండరీలు సాధించిన ఇంగ్లండ్‌ను విశ్వవిజేతగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ బౌండరీల నిబంధనపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. టీమిండియా మాజీ క్రికెటర్లు యువరాజ్‌ సింగ్‌, గంభీర్‌లు ఈ నిబంధనను తప్పుబట్టగా.. వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఈ తరహా నిబంధనలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.