IND-W vs SA-W Final : రిజర్వ్ డే రోజు కూడా వర్షం పడితే? విజేతను ఎలా ప్రకటిస్తారు? ఐసీసీ రూల్స్ ఏమిటి?

భారత మహిళల జట్టు, సౌతాఫ్రికా మహిళల జట్టు మధ్య జరగాల్సిన మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 ఫైనల్‌కు వరుణుడు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాడు. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు మొదలవ్వాల్సి ఉండగా, ఉదయం నుంచి కురుస్తున్న వర్షం కారణంగా టాస్, మ్యాచ్ ప్రారంభం ఆలస్యం అవుతూ వస్తోంది.

IND-W vs SA-W Final : రిజర్వ్ డే రోజు కూడా వర్షం పడితే?  విజేతను ఎలా ప్రకటిస్తారు? ఐసీసీ రూల్స్ ఏమిటి?
Ind W Vs Sa W Final (1)

Updated on: Nov 02, 2025 | 4:19 PM

IND-W vs SA-W Final : భారత మహిళల జట్టు, సౌతాఫ్రికా మహిళల జట్టు మధ్య జరగాల్సిన మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 ఫైనల్‌కు వరుణుడు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాడు. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు మొదలవ్వాల్సి ఉండగా, ఉదయం నుంచి కురుస్తున్న వర్షం కారణంగా టాస్, మ్యాచ్ ప్రారంభం ఆలస్యం అవుతూ వస్తోంది. ఒకానొక దశలో 3:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుందని ప్రకటించినప్పటికీ మళ్లీ వర్షం మొదలైంది. ఈ పరిస్థితుల్లో మ్యాచ్ జరగడం కష్టమేమోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ ఈ ఫైనల్ మ్యాచ్ ఈ రోజు పూర్తి కాకపోతే, విజేతను ఎలా నిర్ణయిస్తారు? ఐసీసీ నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

నవీ ముంబైలో కురుస్తున్న వర్షం కారణంగా మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం ఆలస్యం అవుతోంది. ఈ రోజు (నవంబర్ 2) మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా, టాస్ 2:30 గంటలకు జరగాలి. అయితే, ఉదయం నుంచి పడుతున్న వర్షం, ఆపై మళ్లీ వర్షం మొదలవడంతో, మ్యాచ్ 3:30 గంటలకు కూడా ప్రారంభం కాలేదు. మ్యాచ్ పూర్తిగా రద్దైపోతే ఏమవుతుందో అని అభిమానులు, క్రీడాకారులు ఆందోళన చెందుతున్నారు.

ఒకవేళ ఫైనల్ మ్యాచ్ ఈరోజు (నవంబర్ 2) పూర్తి కాకపోతే, విజేతను నిర్ణయించడానికి ఐసీసీ రిజర్వ్ డే నియమాన్ని అమలు చేస్తుంది. భారత్-దక్షిణాఫ్రికా ఫైనల్‌కు రిజర్వ్ డేగా నవంబర్ 3, సోమవారంను కేటాయించారు. ఒకవేళ నేడు మ్యాచ్ ప్రారంభమై, మధ్యలో వర్షం కారణంగా నిలిచిపోతే రేపు (నవంబర్ 3) ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచే మళ్లీ మ్యాచ్ కొనసాగుతుంది. ఒకవేళ నేడు మ్యాచ్ అస్సలు మొదలు కాకపోయినా, రేపు పూర్తి 50 ఓవర్ల మ్యాచ్‌ను ఆడించడానికి ప్రయత్నిస్తారు. ఆ తర్వాతే ఓవర్లలో కోత విధించే నిర్ణయం తీసుకుంటారు.

రిజర్వ్ డే రోజు కూడా వర్షం పడితే?

రిజర్వ్ డే అయిన సోమవారం (నవంబర్ 3) కూడా నవీ ముంబైలో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ నివేదికలు చెబుతున్నాయి. ఈ సందర్భంలో అంటే రిజర్వ్ డే రోజు కూడా మ్యాచ్‌ను పూర్తి చేయలేని పరిస్థితి ఏర్పడితే, భారత మహిళల జట్టు, సౌతాఫ్రికా మహిళల జట్టును సంయుక్తంగా విజేతలుగా ప్రకటించి, ట్రోఫీని పంచుకునేలా ఐసీసీ నియమం ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..