Women’s World Cup 2025 : మహిళల వరల్డ్ కప్‌లో చతికిల పడ్డ పాక్.. చివరి మ్యాచ్ ఆడకుండానే ఇంటి బాట ?
మహిళల ప్రపంచ కప్ 2025లో పాకిస్తాన్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ దశలో ఇంగ్లాండ్‌తో జరగబోయే మ్యాచ్‌లో గెలిస్తేనే పాకిస్తాన్‌కు టోర్నమెంట్‌లో నిలిచే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో కూడా ఓడిపోతే, ఆ జట్టు ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించడం దాదాపు ఖాయమవుతుంది.

Women’s World Cup 2025 : మహిళల ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడి పాయింట్ల పట్టికలో అకౌంట్ తెరవని పాకిస్తాన్, తదుపరి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను కొలంబో మైదానంలో ఎదుర్కోనుంది. ఈ కీలకమైన మ్యాచ్‌లో కూడా ఓడిపోతే, టోర్నమెంట్ నుంచి నిష్క్రమించే అవకాశం ఉంది. అంటే, టోర్నీలో తన చివరి మ్యాచ్ ఆడే అవకాశం కూడా లేకుండానే ఆ జట్టు ఇంటిదారి పట్టే పరిస్థితి ఏర్పడింది.
మహిళల ప్రపంచ కప్ 2025లో పాకిస్తాన్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ దశలో ఇంగ్లాండ్‌తో జరగబోయే మ్యాచ్‌లో గెలిస్తేనే పాకిస్తాన్‌కు టోర్నమెంట్‌లో నిలిచే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో కూడా ఓడిపోతే, ఆ జట్టు ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించడం దాదాపు ఖాయమవుతుంది. పాకిస్తాన్ జట్టుకు దురదృష్టకరం ఏమిటంటే.. మహిళల క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఇంగ్లాండ్‌పై పాకిస్తాన్‌కు చెప్పుకోదగిన రికార్డు లేదు.
పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టు ఇంగ్లాండ్‌ను ఓడించగలదా అనే ప్రశ్న ప్రస్తుతం ఉత్పన్నమవుతోంది. ఇప్పటివరకు పాకిస్తాన్, ఇంగ్లాండ్ మధ్య 15 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. అందులో 2 మ్యాచ్‌లు ఫలితం లేకుండా ముగిశాయి. మిగిలిన 13 మ్యాచ్‌లలో ఇంగ్లాండ్ గెలిచింది. అంటే, ఇంగ్లాండ్ 13-0 తేడాతో పాకిస్తాన్‌పై తన డామినేషన్‌ను ప్రదర్శించింది. ఈ గణాంకాలు చూస్తుంటే కొలంబో మైదానంలో కూడా ఇంగ్లాండ్‌ను ఓడించడం పాకిస్తాన్‌కు అసాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ మ్యాచ్‌లో గెలవకపోతే, పాకిస్తాన్ ప్రపంచ కప్ ప్రయాణం ఇక్కడితో ముగిసినట్టే.
ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓడిపోతే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించడం ఖాయమవుతుంది. ఎందుకంటే ఆ తర్వాత పాకిస్తాన్ ఆడాల్సిన మిగిలిన రెండు మ్యాచ్‌లు కూడా బలమైన జట్లతోనే ఉన్నాయి. అక్కడ ఒకవేళ గెలిస్తే అనే అవకాశం కూడా తక్కువ. పాకిస్తాన్ తదుపరి న్యూజిలాండ్‌తో, ఆపై సౌతాఫ్రికాతో తలపడాలి. న్యూజిలాండ్‌పై ఇప్పటివరకు ఆడిన 17 మ్యాచ్‌లలో పాకిస్తాన్ కేవలం ఒకటి మాత్రమే గెలిచింది. ఇక సౌతాఫ్రికాపై ఆడిన 31 మ్యాచ్‌లలో కేవలం 6 విజయాలే దక్కించుకుంది. ముఖ్యంగా, మహిళల ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్, సౌతాఫ్రికా రెండింటిపైనా పాకిస్తాన్ ఇప్పటివరకు తలపడిన ప్రతి నాలుగుసార్లు ఓడిపోయింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




