
ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ vs రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియన్ స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్ అద్భుత ప్రదర్శనతో మ్యాచ్ ఫలితాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ వైపు తిప్పాడు. ఆఖరి ఓవర్లో ఆటను సూపర్ ఓవర్‌కు తీసుకెళ్లిన స్టార్క్, ఒత్తిడితో నిండిన సమయంలో అద్భుతంగా బౌలింగ్ చేసి ఢిల్లీకి విజయాన్ని అందించాడు. రాజస్థాన్ జట్టు చివరి ఓవర్‌లో 9 పరుగులు చేయాల్సిన పరిస్థితిలో ఉండగా, స్టార్క్ కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి, షిమ్రాన్ హెట్మైర్‌ను ఔట్ చేశాడు. మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లింది. ఈ ప్రదర్శనపై స్పందించిన ఢిల్లీ క్యాపిటల్స్ అతనికి ప్రత్యేకమైన హాస్యాత్మక నివాళి అర్పించింది. ఢిల్లీ నగరంలోని బిల్‌బోర్డులో “బినా చలాన్ కే స్పీడింగ్ కర్ సక్తా హు”(చలాన్ లేకుండా కూడా స్పీడ్ గా వెళ్తా) అని స్టార్క్ బంతి వేస్తున్న పోస్టర్ పెట్టడం ద్వారా అతని వేగాన్ని ఢిల్లీ ట్రాఫిక్ నియమాలకు పోల్చుతూ సరదాగా ప్రస్తావించారు.
సూపర్ ఓవర్‌లో స్టార్క్ మళ్లీ బౌలింగ్‌కు వచ్చి మొదటి బంతిని నో-బాల్‌గా వేసినా, తర్వాతి బంతుల్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్ ఇద్దరూ రనౌట్ అవడంతో రాజస్థాన్ కేవలం 11 పరుగులకే పరిమితమైంది. అనంతరం ఢిల్లీ తరఫున KL రాహుల్, ట్రిస్టన్ స్టబ్స్ కేవలం నాలుగు బంతుల్లో విజయాన్ని ఖాయం చేశారు. ఈ విజయం డీసీ శిబిరంలో ఆనందోత్సవాలకు కారణమైంది.
ఆ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి దిగినప్పుడు, ఓపెనర్లు సంజు సామ్సన్, జైస్వాల్ శుభారంభాన్ని ఇచ్చారు. జైస్వాల్ స్టార్క్ వేసిన ఓవర్‌లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. అయితే మధ్యలో గాయంతో సామ్సన్ రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. జైస్వాల్ 51 పరుగులు చేశాడు కానీ అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ అతనిని ఔట్ చేయడంతో ఆర్ఆర్ దూకుడు తగ్గిపోయింది. నితీష్ రాణా మిడిల్ ఆర్డర్‌ను 51 పరుగులతో ఆదుకున్నా, చివర్లో స్టార్క్ మళ్లీ బౌలింగ్‌కు వచ్చి అతనిని క్లీన్ బౌల్డ్ చేశాడు. చివరి ఓవర్లో అతని ప్రదర్శన మ్యాచ్‌ను సూపర్ ఓవర్‌కు తీసుకెళ్లింది.
అంతకుముందు, బ్యాటింగ్‌కు దిగిన డీసీ జట్టు 188/5 స్కోరు చేసింది. KL రాహుల్ 38 పరుగులు చేయగా, జోఫ్రా ఆర్చర్ రెండు కీలక వికెట్లు తీసి ఢిల్లీకి షాక్ ఇచ్చాడు. కానీ అక్షర్ పటేల్ (34), ట్రిస్టన్ స్టబ్స్ (34*) చివర్లో బాణసంచా ఆటతో స్కోరును ఊహించని స్థాయికి చేర్చారు. స్టబ్స్ చివరి ఓవర్‌లో 19 పరుగులు చేయడం, అక్షర్ వరుస సిక్సర్లు బాదటం మ్యాచ్ రీతిని మార్చేశాయి.
ఈ విజయంతో డీసీ పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకింది. మిచెల్ స్టార్క్ ప్రదర్శనకు నివాళిగా ట్రాఫిక్ నేపథ్యంతో చేసిన హోర్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ కావడమేగాక, స్టార్క్‌కు మరింత గుర్తింపును తీసుకొచ్చింది. ఢిల్లీ జట్టు విజయం సాధించిన ఈ ఉత్కంఠభరిత మ్యాచ్ ఐపీఎల్ 2025 సీజన్‌లో మరొక అద్భుత జ్ఞాపకంగా నిలిచిపోయింది.
A Special hoarding board for Mitchell Starc by Delhi Capitals 🔥 pic.twitter.com/memsn0jlCa
— Johns. (@CricCrazyJohns) April 17, 2025
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..