ODI Format: వన్డేలకు ఇక చెక్.. క్రికెట్‌లోకి మరో కొత్త ఫార్మాట్ ఎంట్రీ.. ఇకపై ఎన్ని ఓవర్లు ఉంటాయంటే?

|

Mar 14, 2023 | 1:39 PM

ODI World Cup 2023: అక్టోబర్‌లో భారత గడ్డపై ODI ప్రపంచ కప్ జరగాల్సి ఉంది. ఈ టోర్నమెంట్‌కు ముందు, టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి, దినేష్ కార్తీక్ వన్డే క్రికెట్‌లో మార్పులను సూచించారు.

ODI Format: వన్డేలకు ఇక చెక్.. క్రికెట్‌లోకి మరో కొత్త ఫార్మాట్ ఎంట్రీ.. ఇకపై ఎన్ని ఓవర్లు ఉంటాయంటే?
Team India Odi Team
Follow us on

క్రికెట్‌లో కొత్త ఫార్మాట్ రాబోతుందా? వన్డే క్రికెట్‌లో మార్పు రాబోతుందా? ఇప్పుడు 40 ఓవర్ల పాటు వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయా? ప్రస్తుతం ఈ ప్రశ్నలకు సమాధానాలు పొందడం కష్టమే. కానీ, ఈ మార్పులు భవిష్యత్తులో రానున్నట్లు చర్చలు మొదలయ్యాయి. వన్డే ఫార్మాట్‌ను సజీవంగా ఉంచాలంటే అందులో మార్పు అవసరమని టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. వన్డే క్రికెట్‌లో ఇకపై 40 ఓవర్లు ఉండాలని సలహా ఇచ్చాడు. శాస్త్రి ప్రకటనను దినేష్ కార్తీక్ కూడా సమర్థించారు.

వన్డే క్రికెట్ శోభను కోల్పోతుందని, ఈ ఏడాది ప్రపంచకప్ చివరిసారిగా 50 ఓవర్లు కావొచ్చని మాజీలు అభిప్రాయపడుతున్నారు. అసలు వీళ్లు ఎందుకు ఇలా అంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

వన్డే క్రికెట్‌ను మార్చండి: రవిశ్రాస్త్రి

వన్డే క్రికెట్‌ను కాపాడుకోవాలంటే భవిష్యత్తులో 40-40 ఓవర్లకు తగ్గించాలని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. శాస్త్రి మాట్లాడుతూ, 1983లో మనం ప్రపంచకప్‌ గెలిచినప్పుడు 60 ఓవర్ల మ్యాచ్‌లు ఉండేవి. ఆ తర్వాత ప్రజలలో ఆసక్తి తగ్గి దానిని 50 ఓవర్లకు కుదించారు. దాన్ని 40 ఓవర్లకు కుదించే సమయం ఆసన్నమైందని భావిస్తున్నాను. కాలంతో పాటు మార్పు అవసరం’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

వన్డే క్రికెట్ బోరింగ్‌గా మారింది: దినేష్ కార్తీక్

రవిశాస్త్రి మాటలను ఏకీభవిస్తూ దినేష్ కార్తీక్ మరో అడుగు ముందుకేశాడు. క్రికెట్‌లో అత్యుత్తమ ఫార్మాట్ అయిన టెస్టు క్రికెట్‌ను ప్రజలు చూడాలనుకుంటున్నారని చెప్పుకొచ్చాడు. ప్రజలు వినోదం కోసం టీ20 చూస్తుంటారు. కానీ 50 ఓవర్ల ఆట బోరింగ్‌గా మారింది. ప్రజలు 7 గంటల పాటు కూర్చుని చూడడానికి ఇష్టపడడం లేదు. అందుకే బహుశా భారత్‌లో జరగనున్న ప్రపంచకప్‌ను 50 ఓవర్లలో చివరిసారిగా ఆడే అవకాశం ఉందని కార్తీక్ పేర్కొన్నాడు. ఇప్పుడు రవిశాస్త్రి, దినేష్ కార్తీక్‌ల మాటలు ఎంతవరకు నిజం కాబోతున్నాయి, దీనిపై ఐసీసీ ఏమనుకుంటుందో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..