Mukesh Kumar: భారత్, వెస్టిండీస్ మధ్య చారిత్రక టెస్టు మ్యాచ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్ స్టేడియంలో భారత్-వెస్టిండీస్ రెండో టెస్టు మ్యాచ్ ఈరోజు ప్రారంభం కానుంది. డొమినికా వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. విశేషమేమిటంటే.. భారత్ , వెస్టిండీస్ మధ్య ఇది 100వ టెస్టు మ్యాచ్. ఇందులో ముఖేష్ కుమార్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది.
రెండో టెస్టుకు టీమిండియా ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా యువ పేసర్ ముఖేష్ కుమార్ నెట్స్‌లో బౌలింగ్‌ను నిలకడగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈరోజు అరంగేట్రం చేసే అవకాశం ఉంది. జయదేవ్ ఉనద్కత్ స్థానంలో ఆయన పోటీ చేసే అవకాశం ఉంది. తొలి మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ అరంగేట్రం చేశారు. వీరిలో జైస్వాల్ అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడు.
ఇండో-వెస్టిండీస్ రెండో టెస్టు మ్యాచ్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే, భారత్ కాలమానం ప్రకారం రాత్రి గం.7.30లకు ప్రారంభమవుతుంది. దూరదర్శన్ (DD) స్పోర్ట్స్ ఛానెల్‌లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. Jio సినిమా, ఫ్యాన్‌కోడ్ యాప్‌లలో ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది.
— BCCI (@BCCI) July 20, 2023
పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో సూర్యరశ్మి కనిపించడం లేదు. టెస్ట్ మ్యాచ్ జరిగే ఐదు రోజులూ మేఘావృతమై వర్షం కురిసే అవకాశం ఉంది. weather.com ప్రకారం, మ్యాచ్ జరిగే ఐదు రోజులలో 52 శాతం, 49 శాతం, 51 శాతం, 47 శాతం, 41 శాతం వర్షం కురుస్తుంది. మ్యాచ్ జరిగే ఐదు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుంది.
పిచ్ చూస్తుంటే క్వీన్స్ పార్క్ ఓవల్‌లో తొలి రెండు ఇన్నింగ్స్‌ల్లో బ్యాటర్లు రాణిస్తారని తెలుస్తుంది. అయితే మ్యాచ్ జరుగుతున్న కొద్దీ పిచ్ నెమ్మదించే ఛాన్స్ ఉంది. ఫాస్ట్ బౌలర్లు కొత్త బంతితో బౌలింగ్ చేయడం ఆనందించవచ్చు. చివరి రెండు రోజుల్లో ఈ పిచ్‌పై స్పిన్నర్లు సత్తా చాటుతారు. ఇక్కడ ఆడిన 61 టెస్టుల్లో, ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు 20 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, ఛేజింగ్ జట్టు 18 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. క్వీన్స్ పార్క్ ఓవల్‌లో సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 300 కంటే ఎక్కువ.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..