విండీస్ సిరీస్ మధ్యలోనే రిటైర్మెంట్.. ఫేర్‌వెల్ మ్యాచ్ లేకుండానే వీడ్కోలు.. లిస్టులో ముగ్గురు భారత దిగ్గజాలు..
Indian Cricketer Retirement: రెండో, చివరి టెస్ట్ మ్యాచ్ నుంటి నుంచి అంటే జులై 20 అంటే గురువారం నుంచి మొదలుకానుంది. ఇదిలా ఉంటే భారత్‌కు చెందిన ఈ ముగ్గురు ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Indian Cricket Team: ప్రస్తుతం భారత్, వెస్టిండీస్ మధ్య 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగుతోంది. సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు రెండో, చివరి టెస్ట్ మ్యాచ్ నుంటి నుంచి అంటే జులై 20 అంటే గురువారం నుంచి మొదలుకానుంది. ఇదిలా ఉంటే భారత్‌కు చెందిన ఈ ముగ్గురు ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ ముగ్గురు ఆటగాళ్లు రిటైర్ అవుతారా..!
భారత్ ఎంతోమంది క్రికెటర్లను ప్రపంచానికి అందించింది. ఈ ప్రక్రియ నేటికీ నిరాటంకంగా కొనసాగుతోంది. చాలా మంది యువ ఆటగాళ్లు టీమిండియా తరపున తమను తాము నిరూపించుకుంటున్నారు. మరికొందరు ఎంట్రీ కోసం నిరంతరం ఎదురుచూస్తునే ఉన్నారు. వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌కు భారత సెలక్టర్లు ముగ్గురు ఆటగాళ్లకు అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు వారికి రిటైర్మెంట్ ఎంపిక మాత్రమే ఉంది. ఈ ఆటగాళ్లు చాలా కాలంగా మరే ఇతర ఫార్మాట్‌లోనూ భారత్‌కు మ్యాచ్‌లు ఆడకపోవడమే దీనికి పెద్ద కారణం.
రెండేళ్ల పాటు జట్టుకు దూరంగా..
ఈ జాబితాలో మొదటి పేరు భారత అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ. ఇషాంత్ గత 2 సంవత్సరాలుగా భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు అతని కెరీర్ దాదాపుగా ముగిసినట్లే. 2021లో చివరిసారిగా టీమిండియా తరపున ఆడిన ఇషాంత్ వెస్టిండీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో భాగం కావడం లేదు. 34 ఏళ్ల వెటరన్ పేసర్ తన కెరీర్‌లో 105 టెస్టులు, 80 వన్డేలు, 14 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. టెస్టుల్లో 311 వికెట్లు, వన్డేల్లో 115, టీ20 అంతర్జాతీయ ఫార్మాట్‌లో 8 వికెట్లు పడగొట్టాడు. ఇషాంత్‌కు మళ్లీ టీమ్ ఇండియాలో అవకాశం లభించదనే చెప్పుకోవాలి. అయితే, ఫేర్‌వెల్ మ్యాచ్ లేకుండానే రిటైర్మెంట్ ప్రకటించాల్సి ఉంటుందని తెలుస్తోంది.
టెస్ట్ టీమ్ వికెట్ కీపర్..
ఈ జాబితాలో రెండో స్థానంలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ వృద్ధిమాన్ సాహా ఉన్నాడు. 2010లో దక్షిణాఫ్రికాతో టెస్టు అరంగేట్రం చేసిన సాహా ఈ ఫార్మాట్‌లో 40 మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కించుకున్నాడు. అతను వన్డేల్లో కేవలం 9 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. టీ20 ఇంటర్నేషనల్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఎప్పుడూ రాలేదు. 38 ఏళ్ల వృద్ధిమాన్ సాహా తన అంతర్జాతీయ కెరీర్‌లో 3 సెంచరీలు సాధించగా, ఈ మూడూ సెంచరీలు టెస్టుల్లోనే వచ్చాయి. తమ భవిష్యత్ ప్రణాళికల్లో సాహాను చేర్చుకోలేదని భారత జట్టు మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది. రిషబ్ పంత్ గాయపడినప్పటికీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC Final-2023) ఫైనల్‌కు కూడా సాహా ఎంపిక కాలేదు. సాహా 3 సెంచరీలు, 6 అర్ధ సెంచరీలతో సహా 29.41 సగటుతో టెస్టుల్లో 1353 పరుగులు చేశాడు.
ద్రవిడ్‌లా బ్యాటింగ్..
ఈ జాబితాలో మూడో స్థానంలో భారత వెటరన్ బ్యాట్స్‌మెన్ చెతేశ్వర్ పుజారా నిలిచాడు. అతను లండన్‌లో జరిగిన WTC ఫైనల్‌లో భాగంగా ఉన్నాడు. కానీ, పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఆ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అతను 41 పరుగులు (27, 14) మాత్రమే జోడించగలిగాడు. ఆ తర్వాత వెస్టిండీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు అతడిని జట్టు నుంచి తప్పించారు. పుజారా త్వరలో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 35 ఏళ్ల పుజారా 103 టెస్టులు, 5 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీల సాయంతో మొత్తం 7195 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్ ద్వారా 2010లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. వన్డేల్లో 5 ఇన్నింగ్స్‌ల్లో 51 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..