
Harmanpreet Kaur : భారత మహిళా క్రికెట్ జట్టు తొలిసారిగా వన్డే ప్రపంచకప్ 2025 టైటిల్‌ను కైవసం చేసుకున్న నవంబర్ 2వ తేదీ, భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. ఈ చారిత్రక విజయం తర్వాత, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ట్రోఫీ అందుకునేందుకు ఐసీసీ ఛైర్మన్ జై షా వద్దకు వెళ్లారు. అప్పుడు హర్మన్‌ప్రీత్ గౌరవపూర్వకంగా జై షా కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించారు. అయితే, జై షా ఆమెను వెంటనే వారించి తన పాదాలను తాకనివ్వకుండా ఆపారు. మహిళా క్రికెట్‌కు అపారమైన మద్దతు అందిస్తున్న జై షా, భారత కెప్టెన్ పాదాలు తాకకుండా ఆపడానికి గల కారణం తెలిసి, సోషల్ మీడియాలో ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
భారత మహిళా క్రికెట్ జట్టు నవంబర్ 2న దక్షిణాఫ్రికాను ఓడించి తమ తొలి ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ విజయం తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, ట్రోఫీని అందుకునే క్రమంలో ఐసీసీ ఛైర్మన్ జై షా పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకోవడానికి ప్రయత్నించారు. అయితే, జై షా ఆమెను వెంటనే వారించి అలా చేయకుండా ఆపారు. ప్రపంచకప్ లీగ్ దశలో భారత జట్టు వరుసగా మూడు మ్యాచ్‌లలో ఓడిపోయినప్పుడు, హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీ మీద విమర్శలు వచ్చాయి. కానీ, వరల్డ్ కప్ గెలుపుతో ఆమె తన విమర్శకులకు సరైన సమాధానం ఇచ్చారు.
జై షా హర్మన్‌ప్రీత్ పాదాలు తాకకుండా ఆపడానికి గల కారణం, భారతదేశ సంస్కృతి, హిందూ ధర్మం పట్ల ఆయనకున్న గౌరవాన్ని తెలియజేస్తుంది. హిందూ ధర్మంలో స్త్రీని శక్తి స్వరూపిణిగా, పూజనీయురాలుగా భావిస్తారు. అందుకే సాధారణంగా ఆడపిల్లలు/స్త్రీలు ఇతరుల పాదాలను తాకకూడదని భావిస్తారు. మహిళలు తమ తండ్రులు, గురువులు లేదా పెద్దవారి పాదాలను మాత్రమే తాకే సంప్రదాయం ఉంది. జై షా, హర్మన్‌ప్రీత్ కౌర్ దాదాపు సమాన వయస్సు ఉన్నవారు కావడం వల్ల, జై షా ఆమెను పాదాలు తాకనిస్తే అది స్త్రీ గౌరవాన్ని తగ్గించినట్లుగా అవుతుందని భావించారు.
Just see the SANSKAR
Harmanpreet tried to TOUCH feet of Jay Shah but he REFUSED & in fact, BOWED to her as she’s Nari Shakti of Bharat 🇮🇳
Then he gave the trophy & LEFT the stage ASAP after the mandatory photos
Recall a leader who was pushed off the stage by the RUDE Aussies… pic.twitter.com/wjLpT6nS9R
— PallaviCT (@pallavict) November 2, 2025
హర్మన్‌ప్రీత్ పాదాలు తాకడానికి ప్రయత్నించినప్పుడు ఆమెను అడ్డుకుని జై షా చేసిన చర్యను సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున ప్రశంసించారు. జై షా తన చర్యతో నారీ శక్తికి గొప్ప గౌరవాన్ని ఇచ్చారని, ఇది ఆయన మంచి సంస్కారాలను ప్రతిబింబిస్తుందని నెటిజన్లు కొనియాడారు. బీసీసీఐ మాజీ కార్యదర్శిగా, ప్రస్తుతం ఐసీసీ ఛైర్మన్‌గా ఉన్న జై షా భారత మహిళా క్రికెట్‌ను అభివృద్ధి చేయడంలో, ప్రపంచ క్రికెట్‌లో మహిళా ప్రపంచకప్‌కు కొత్త గుర్తింపు తీసుకురావడంలో ముఖ్యమైన కృషి చేస్తున్నారు.