AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

44 బంతుల్లో 10 ఫోర్లు, 9 సిక్సర్లు.. టీ20 అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డ్.. వైభవ్ కంటే డేంజరస్ ఈ బుడ్డోడు

Who is Amit Passi: సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో ఒక యువ బ్యాట్స్‌మన్ సంచలనం సృష్టించాడు. ఈ కుడిచేతి వాటం వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మన్ కేవలం 44 బంతుల్లో సెంచరీ చేసి ఒక భారీ రికార్డును బద్దలు కొట్టాడు.

44 బంతుల్లో 10 ఫోర్లు, 9 సిక్సర్లు.. టీ20 అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డ్.. వైభవ్ కంటే డేంజరస్ ఈ బుడ్డోడు
Amit Passi
Venkata Chari
|

Updated on: Dec 08, 2025 | 5:06 PM

Share

Who is Amit Passi: ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) 2025లో ఒక యువ బ్యాటర్ సంచలనం సృష్టించాడు. తన తొలి టీ20 మ్యాచ్‌లోనే ఏకంగా సెంచరీతో చెలరేగి, భారత క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనత సాధించాడు. ఆ ఆటగాడి పేరు ‘అమిత్ పాసీ’. బరోడా జట్టు తరపున ఆడుతున్న ఈ వికెట్ కీపర్-బ్యాటర్, సర్వీసెస్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.

పరుగుల ప్రవాహం..

హైదరాబాద్‌లోని జింఖానా గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో బరోడా తొలుత బ్యాటింగ్ చేసింది. క్రీజులోకి వచ్చిన అమిత్ పాసీ సర్వీసెస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం బౌండరీల (ఫోర్లు, సిక్సర్లు) ద్వారానే అతను 94 పరుగులు రాబట్టడం విశేషం. పాసీ అద్భుత ఇన్నింగ్స్‌తో బరోడా జట్టు 20 ఓవర్లలో 220 పరుగుల భారీ స్కోరు సాధించింది. చివరకు ఈ మ్యాచ్‌లో బరోడా 13 పరుగుల తేడాతో విజయం సాధించింది.

మొత్తంగా 55 బంతుల్లో 114 పరుగులు చేశాడు. కేవలం 44 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు ఈ యువ సంచలనం. ఇందుల 10 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Team India: జైస్వాల్ సెంచరీతో ఆ ఇద్దరు ఓపెనర్ల కెరీర్ క్లోజ్.. ఇకపై భారత జట్టులోకి రావడం కష్టమే.?

ప్రపంచ రికార్డు సమం..

తన అరంగేట్ర టీ20 మ్యాచ్‌లోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా అమిత్ పాసీ ప్రపంచ రికార్డును సమం చేశాడు. 2015లో పాకిస్థాన్ ఆటగాడు బిలాల్ ఆసిఫ్ తన అరంగేట్రంలో 114 పరుగులు చేశాడు. ఇప్పుడు పాసీ ఆ రికార్డును సమం చేయడమే కాకుండా, అరంగేట్రంలోనే ఇంత భారీ స్కోరు చేసిన తొలి భారతీయ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.

ది కూడా చదవండి: T20 World Cup 2026: 15 మందితో టీ20 ప్రపంచకప్ స్వ్కాడ్.. ఆ ఇద్దరిని పక్కన పెట్టేసిన గంభీర్..?

జితేష్ శర్మ స్థానంలో వచ్చి..:

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, టీమిండియా వికెట్ కీపర్ జితేష్ శర్మ దక్షిణాఫ్రికా సిరీస్ కోసం జాతీయ జట్టుకు ఎంపికవడంతో, బరోడా జట్టులో అతని స్థానంలో అమిత్ పాసీకి అవకాశం దక్కింది. వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న ఈ యువ కెరటం, తన మొదటి మ్యాచ్‌లోనే రికార్డుల మోత మోగించాడు. బరోడా ప్రీమియర్ లీగ్‌లో కేవలం 100 పరుగులు మాత్రమే చేసినప్పటికీ, సెలెక్టర్లు అతనిపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయలేదు. భారత క్రికెట్‌కు మరో సత్తా ఉన్న వికెట్ కీపర్-బ్యాటర్ దొరికాడని క్రీడా విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల 2026 తేదీలు వచ్చేశాయ్.. ఎప్పట్నుంచంటే?
పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల 2026 తేదీలు వచ్చేశాయ్.. ఎప్పట్నుంచంటే?
టీ20 అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డ్.. వైభవ్ కంటే డేంజరస్ భయ్యో..
టీ20 అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డ్.. వైభవ్ కంటే డేంజరస్ భయ్యో..
క్యూర్, ప్యూర్, రేర్ మోడల్‌తో తెలంగాణ అభివృద్ది: భట్టి విక్రమార్క
క్యూర్, ప్యూర్, రేర్ మోడల్‌తో తెలంగాణ అభివృద్ది: భట్టి విక్రమార్క
ఏటీఎంలో నకిలీ రూ.500 నోట్లు.. ఇక జాగ్రత్తగా ఉండాల్సిందే
ఏటీఎంలో నకిలీ రూ.500 నోట్లు.. ఇక జాగ్రత్తగా ఉండాల్సిందే
ప్రియుడు కాదు.. రాక్షసుడు.. పెళ్లికి ఒప్పుకోలేదని.. పట్టపగలే..
ప్రియుడు కాదు.. రాక్షసుడు.. పెళ్లికి ఒప్పుకోలేదని.. పట్టపగలే..
పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. డిసెంబర్ 18 వరకే ఛాన్స్!
పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. డిసెంబర్ 18 వరకే ఛాన్స్!
15 మందితో టీ20 ప్రపంచకప్ స్వ్కాడ్.. ఆ ఇద్దరిని ఛీకొట్టిన గంభీర్?
15 మందితో టీ20 ప్రపంచకప్ స్వ్కాడ్.. ఆ ఇద్దరిని ఛీకొట్టిన గంభీర్?
చైనా, జపాన్‌తో పోటీ.. గ్లోబల్ సమ్మిట్‌లో రేవంత్ కామెంట్స్
చైనా, జపాన్‌తో పోటీ.. గ్లోబల్ సమ్మిట్‌లో రేవంత్ కామెంట్స్
కోకాపేట ప్లాట్లకు అందుకే ఆ రేంజ్‌ ధరలు
కోకాపేట ప్లాట్లకు అందుకే ఆ రేంజ్‌ ధరలు
నిరుద్యోగులకు భలే న్యూస్.. రాత పరీక్షలేకుండా సింగరేణిలో ఉద్యోగాలు
నిరుద్యోగులకు భలే న్యూస్.. రాత పరీక్షలేకుండా సింగరేణిలో ఉద్యోగాలు