Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RR vs MI, IPL 2021 Match Prediction: చావో రేవో తేల్చుకోనున్న ముంబై, రాజస్థాన్ టీంలు.. ఎవరి బలాలు ఎలా ఉన్నాయో చూద్దాం..!

Today Match Prediction of RR vs MI: రోహిత్ శర్మ వర్సెస్ సంజు శాంసన్ మధ్య నేడు తీవ్రమైన పోటీ నెలకొంది. ప్లే ఆఫ్‌లో నిలవాలంటే ఇరుజట్లకు విజయం చాలా కీలకం. ఈ మ్యాచులో ఓడిపోతే టోర్నమెంట్‌ నుంచి తప్పుకోనుంది.

RR vs MI, IPL 2021 Match Prediction: చావో రేవో తేల్చుకోనున్న ముంబై, రాజస్థాన్ టీంలు.. ఎవరి బలాలు ఎలా ఉన్నాయో చూద్దాం..!
Ipl 2021 Rr Vs Dc
Follow us
Venkata Chari

|

Updated on: Oct 05, 2021 | 7:50 AM

RR vs MI, IPL 2021 Match Prediction: ఈ వారం IPL 2021 లో ప్లే ఆఫ్‌ చివరి స్థానంలో ఎవరు ఉండనున్నారో తెలిసిపోనుంది. అంటే ఈ వారం చివరి నాటికి ప్లేఆఫ్స్‌లో 4 జట్లకు సంబంధించి పరిస్థితి స్పష్టంగా మారనుంది. 3 జట్లు తమ స్థానాన్ని ఇప్పటికే నిర్ధారించుకున్నాయి. అటువంటి పరిస్థితిలో 4 వ స్థానం కోసం 3 జట్లు ఫీల్డ్‌లో ఉన్నాయి. ఈ రోజు ముంబై ఇండియన్స్ లేదా రాజస్థాన్ రాయల్స్ మధ్య పోటీ ఉంది. ఈరోజు షార్జాలో జరిగే పోరులో రాజస్థాన్ లేదా ముంబై ఓడిపోతే ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకోవాల్సిందే.

ఎప్పుడు: మంగళవారం, అక్టోబర్ 5, 2021 న, రాత్రి 07:30 గంటలకు

ఎక్కడ: షార్జా క్రికెట్ స్టేడియం, షార్జా

మ్యాచ్ లైవ్‌ను ఎలా చూడాలి: ఐపీఎల్‌ అన్ని మ్యాచులను స్టార్ స్పోర్ట్స్ ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఇక ఓటీటీలో చూడాలని అనుకుంటే మాత్రం డిస్నీ హాట్‌స్టార్ యాప్‌లో చూడొచ్చు.

హెడ్ టూ హెడ్ రికార్డులు: ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్‌టీంలు ఇప్పటి వరకు 23 మ్యాచుల్లో తలపడ్డారు. ఇందులో ముంబై టీం 12 విజయాలతో కొంచెం ముందుంది. రాజస్థాన్ టీం 11 విజయాలు సాధించింది.

మీకు తెలుసా? – ఆర్ఆర్‌కి వ్యతిరేకంగా రోహిత్ రికార్డ్ మామూలుగానే ఉంది. ఓపెనర్ 16 ఇన్నింగ్స్‌లలో 18.38 సగటుతో కేవలం 294 పరుగులు సాధించాడు. 120.99 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించాడు.

– ఐసీఎల్ 2021 రెండో దశలో స్పిన్నర్‌లపై ఎంఐ స్కోరింగ్ రేటు 6.11 rpoగా ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రమే 6.05 పరుగుల రేటుతో అధ్వాన్నంగా ఉంది.

ఐపీఎల్ 2021లో ఈ రోజు రాజస్థాన్, ముంబై జట్లు రెండోసారి తలపడుతున్నాయి. అంతకుముందు లీగ్ ప్రథమార్ధంలో తలపడ్డాయి. ఇందులో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ జట్టే గెలిచింది. షార్జాలో ఈ రెండు జట్లు ఈ రోజు మొదటిసారి తలపడుతున్నాయి. అయితే గత 5 మ్యాచ్‌లలో ఈ రెండు జట్ల రిపోర్ట్ కార్డ్‌ని ఓసారి పరిశీలిస్తే.. సంజు శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ 3-2తో నిలిచింది. రెండు జట్ల విజయాలతోపాటు ఓటముల మధ్య పెద్ద అంతరం లేదు. రాజస్థాన్ కంటే ముంబై కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. ఇప్పటివరకు ఆడిన 26 మ్యాచ్‌లలో ముంబై 13 గెలిచింది. రాజస్థాన్ రాయల్స్ 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. దీంతో ఈ పోటీలో కూడా ఇరుజట్లు హోరాహోరీగా తలపడనున్నాయనే విషయం అర్థమవుతోంది.

బలాలు.. బలహీనతలు ఎలా ఉన్నాయంటే.. ఇరు జట్ల విషయానికొస్తే, ప్రత్యేకించి గత మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ టీంకు కొంత సానుకూలంగా కనిపిస్తోంది. ముంబై కంటే ఎక్కువగా విజయానికి అర్హత ఉన్న జట్టుగా మారింది. ఆ జట్టు సీఎస్‌కేకి వ్యతిరేకంగా 15 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుని అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. రితురాజ్ గైక్వాడ్ సెంచరీ ఏమాత్రం జట్టును కాపాడలేకపోయింది. చివరి మ్యాచ్‌లో రాజస్థాన్ ఆట చూస్తే నిజంగా వారు ప్లే ఆఫ్‌లో చోటు దక్కించుకోవడం చాలా సలభమే అనిపిస్తోంది. శివమ్ దుబే చేరికతో జట్టులో కొత్త ఆశలు కనిపిస్తున్నాయి. మరోవైపు, ముంబై ఇండియన్స్ జట్టు ఇంకా సరైన ఆట తీరును కనబర్చడం లేదు. అత్యల్ప స్కోరును కూడా ఛేదించలేక ఓడిపోతున్నారు. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌ను బాగానే ఉన్నా ఆకట్టుకోలేకపోతున్నారు. మరి ఈ రోజు మ్యాచులో ఏం చేస్తారో చూడాలి.

ప్లేయింగ్ XI అంచనా: రాజస్థాన్ రాయల్స్: ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్ & కీపర్), శివమ్ దూబే, గ్లెన్ ఫిలిప్స్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, ఆకాష్ సింగ్/శ్రేయస్ గోపాల్, మయాంక్ మార్కండే, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రహమాన్

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారీ, హార్దిక్ పాండ్యా, కీరాన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, నాథన్ కౌల్టర్-నైల్, జయంత్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్

Also Read: IPL 2021: మసకబారుతోన్న ధోని బ్యాట్.. మిస్టర్ కూల్ సరసన దారుణమైన రికార్డు.. అదేంటంటే..!

IPL 2021: ఐపీఎల్‌ ఆరేంజ్‌ క్యాప్‌ రేస్‌..! కేఎల్ రాహుల్ కింగ్‌ ఆఫ్ ద నెంబర్‌ వన్‌..