AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PBKS vs RR, IPL 2021 Match Prediction: ముంబై ప్లేస్‌కు చెక్ పెట్టేందుకు ఇరుజట్లు రెడీ! అరుదైన రికార్డుకు చేరువలో రాహుల్

Today Match Prediction of Punjab Kings vs Rajasthan Royals: ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచినా, పాయింట్ల పరంగా నాలుగో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్‌తో సమానంగా ఉంటుంది.

PBKS vs RR, IPL 2021 Match Prediction: ముంబై ప్లేస్‌కు చెక్ పెట్టేందుకు ఇరుజట్లు రెడీ! అరుదైన రికార్డుకు చేరువలో రాహుల్
Pbks Vs Rr, Ipl 2021
Venkata Chari
|

Updated on: Sep 21, 2021 | 3:21 PM

Share

PBKS vs RR, IPL 2021: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2021) ఫేజ్ -2 లో రాజస్థాన్ రాయల్స్ మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచినా, పాయింట్ల పరంగా నాలుగో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్‌తో సమానంగా ఉంటుంది. ముంబై ప్రస్తుతం 8 మ్యాచ్‌లు ఆడి నుండి 8 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలించింది. రాజస్థాన్ (7 మ్యాచ్‌లు), పంజాబ్ (8 మ్యాచ్‌లు) చెరో 6 పాయింట్లతో సమనంగా ఉన్నారు. అయితే, ముంబై నుంచి నాలుగో స్థానాన్ని దక్కించుకోవడానికి ఇద్దరూ భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ముంబై నెట్ రన్ రేట్ -0.071 గా ఉంది. రాజస్థాన్ నికర రన్ రేట్ -0.190కాగా, పంజాబ్ -0.368గా ఉంది.

ఎప్పుడు: మంగళవారం, సెప్టెంబర్ 21 మంగళవారం, రాత్రి 7:30 గంటలకు

ఎక్కడ: దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం

పిచ్: ఈ పిచ్ ఎక్కువగా పేస్ బౌలర్లకు సహకరిస్తుందని తెలుస్తుంది. సీఎస్‌కే వర్సెస్ ఎంఐ తొలి మ్యాచ్‌లో కూడా ఇదే జరిగింది.

హెడ్ ​​టు హెడ్: పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లలో రాయల్స్ మెరుగైన రికార్డును కలిగి ఉంది. రాజస్థాన్ రాయల్స్ టీం 12 విజయాలు సాధించగా, పంజాబ్ కింగ్స్ 10 విజయాలు సాధించింది. ఇరు జట్ల మధ్య జరిగిన చివరి గేమ్ ముంబైలో జరిగింది. ఫైనల్-ఓవర్ థ్రిల్లర్‌లో పంజాబ్ కింగ్స్ టీం నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది.

మీకు తెలుసా?

– ఈ ఐపీఎల్‌లో ఎనిమిది జట్లలో రాబోయే టీ 20 వరల్డ్ కప్ కోసం భారత జట్టులో ప్రాతినిధ్యం లేని ఏకైక జట్టు రాజస్థాన్ రాయల్స్ టీం మాత్రమే.

– ముస్తాఫిజుర్ (43), షమ్సి (41) 2021 లో టీ 20 ల్లో అత్యధిక వికెట్లు తీసిన లిస్టులో రెండవ, మూడవ స్థానంలో ఉన్నారు. రషీద్ ఖాన్ (49) కంటే వెనుకబడి ఉన్నారు.

– ఈ సీజన్‌లో పవర్‌ప్లేలో కనీసం 50 బంతులు ఎదుర్కొన్న వారిలో, రుతురాజ్ గైక్వాడ్ (91.8), కేఎల్ రాహుల్ (96.4) 100 లోపు స్ట్రైక్ రేట్ సాధించారు.

రెండో బ్యాట్స్‌మెన్‌గా రాహుల్..? పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఐపీఎల్‌లో 88 మ్యాచ్‌ల్లో 79 ఇన్నింగ్స్‌లలో 2978 పరుగులు చేశాడు. 3000 పరుగులు పూర్తి చేయడానికి కేవలం 22 పరుగుల దూరంలో నిలిచాడు. ఐపీఎల్‌లో 3000 పరుగులు చేసిన రెండో వేగవంతమైన బ్యాట్స్‌మెన్‌గా రాహుల్ నిలిచే అవకాశం ఉంది. ఈ మైలురాయిని అత్యంత వేగంగా చేరుకున్న రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది. ఐపీఎల్‌లో గేల్ 75 ఇన్నింగ్స్‌లలో 3,000 పరుగులు చేశాడు.

జోస్ బట్లర్ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరంటే.. ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ ఇటీవల తండ్రి అయ్యాడు. ఐపీఎల్ ఫేజ్ -2 నుంచి దూరం అయ్యాడు. దీంతో అతని స్థానంలో వెస్టిండీస్ ఎవిన్ లూయిస్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. వికెట్ కీపింగ్ కెప్టెన్ సంజు శాంసన్. లూయిస్ గతంలో స్పిన్‌కు వ్యతిరేకంగా ఆడలేక ఇబ్బంది పడేవాడు. కానీ ఇటీవల అతను ఈ బలహీనతను అధిగమించాడు. గత కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL)లో అతను స్పిన్నర్‌లపై 57 సగటు, 138 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు.

పేస్‌‌ బౌలింగ్‌లో.. పంజాబ్ కింగ్స్‌లో జాయ్ రిచర్డ్‌సన్, రిలే మెరెడిత్ రూపంలో ఇద్దరు మంచి ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. కానీ, ఇద్దరూ ఫేజ్ 2 లో ఆడకూడదని నిర్ణయించుకున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన నాథమ్ ఎల్లిస్‌ను పంబాజ్ ఆడించే ఛాన్స్ ఉంది. 26 ఏళ్ల ఎల్లిస్ డెత్ ఓవర్ స్పెషలిస్ట్‌గా పరిగణించబడ్డాడు.

క్రిస్‌గేల్‌కు చెక్ పెట్టేందుకు మోరీస్ సిద్ధం.. గేల్‌కు వ్యతిరేకంగా క్రిస్ మోరిస్ ఓ ఆయుధంలా వాడాలని రాజస్థాన్ రాయల్స్ టీం కోరుకుంటోంది. క్రిస్ గేల్ ఎక్కువ సేపు క్రీజ్‌లో గడిపితే ప్రత్యర్థి జట్టుకు చాలా సమస్యలు తలెత్తుతాయి. దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ రూపంలో గేల్‌కు చెక్ పెట్టేందుకు రాయల్స్ సిద్ధమైంది. మోరిస్ ఇప్పటివరకు గేల్‌ను మూడుసార్లు పడగొట్టాడు. అలాగే మోరిస్ 14 వికెట్లతో ఈ సీజన్‌లో రెండవ టాప్ బౌలర్‌గా ఉన్నాడు.

మొదటి ఇన్నింగ్స్‌ సగటు స్కోర్ 166 దుబాయ్‌లో ఇప్పటి వరకు 34 ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు 166 పరుగులుగా నమోదైంది. స్పిన్నర్ల కంటే ఫాస్ట్ బౌలర్లు ఇక్కడ ఎక్కువగా రాణిస్తుంటారు. ప్రతి ఇన్నింగ్స్‌లో ఫాస్ట్ బౌలర్లు సగటున 3.76 వికెట్లు తీసుకున్నారు. అదే సమయంలో, స్పిన్నర్లు ఒక ఇన్నింగ్స్‌కు సగటున 1.64 వికెట్లు తీసుకున్నారు.

సిక్సర్లలో పోటీ.. ఈ ఐపీఎల్ సీజన్‌లో రెండు జట్లు సిక్సర్ల వేటలో పోటీపడుతున్నాయి. పంజాబ్ కింగ్స్ బ్యాట్స్ మెన్స్ ఇప్పటి వరకు 57 సిక్సర్లు కొట్టారు. రాజస్థాన్ బ్యాట్స్ మెన్స్ 52 సిక్సర్లు కొట్టారు. 2021 సీజన్‌లో డెత్ ఓవర్లలో సిక్సర్లను పొందడంలో రాయల్స్ జట్టు ముందంజలో ఉంది. ఈ జట్టు డెత్ ఓవర్లలో 20 సిక్సర్లు సాధించింది.

పంజాబ్ కింగ్స్ XI: కేఎల్ రాహుల్ (కెప్టెన్, కీపర్), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్/ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, షారుఖ్ ఖాన్, ఆదిల్ రషీద్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, మహ్మద్ షమీ

రాజస్థాన్ రాయల్స్ XI: ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్, కీపర్), రియాన్ పరాగ్, శివమ్ దూబే, లియామ్ లివింగ్‌స్టోన్, రాహుల్ తెవాటియా, క్రిస్ మోరిస్, చేతన్ సకారియా, కార్తీక్ త్యాగి, ముస్తఫిజుర్ రహమాన్/తబరైజ్ షమ్సీ

Also Read: KKR vs RCB: కోహ్లీ సేనకు ఏమైంది..? భారీ అంచనాలను తుస్సుమనిపించారు.. ఈ సీజన్‌లోనే ఆర్‌సీబీ ఘోర పరాజయం

England: పాకిస్తాన్‌కు మరో ఎదురు దెబ్బ.. పర్యటనను రద్దు చేసుకున్న ఇంగ్లండ్ టీం..!