India vs New Zealand WTC 2021 Match Prediction: క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న రోజు రానే వచ్చింది. మరికొద్ది గంటల్లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కు తెరలేవనుంది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య శుక్రవారం నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్ సౌథాంప్టన్ వేదికగా ప్రారంభం కానుంది. ఇరు జట్లు సమఉజ్జీలుగానే కనిపిస్తున్నా.. చివరికి విజయం ఎవరిని వరిస్తుందోనని క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎంఎస్ ధోనీ సరసన చేరేందుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆశపడుతుండగా.. తన హయాంలోనైనా తొలి ఐసీసీ ట్రోఫీని బహుమతిగా ఇవ్వాలని కేన్ విలియమ్సన్ ఆరాటపడుతున్నారు. ఫైనల్ సమరానికి ముందు ఇంగ్లండ్ తో రెండు టెస్టుల సిరీస్‌ను 1-0తో గెలిచి, సగర్వంగా బరిలోకి దిగనుంది కేన్ సేన. మరోవైపు కేవలం ప్రాక్టీస్ మ్యాచ్‌లతోనే ఆత్మస్థైర్యం మూటకట్టుకొని మైదానంలో అడుగుపెట్టబోతోంది విరాట్ సేన. విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి మరి. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఎవరి బలాలు ఎలా ఉన్నాయో ప్రివ్యూలో చూద్దాం..
144 ఏళ్ల టెస్టు క్రికెట్..
ప్రస్తుతం టెస్టులంటే ఆసక్తి ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గింది. ఈ రంగంలోకి పరిమిత ఓవర్ల క్రికెట్ వచ్చాక టెస్టు క్రికెట్ ప్రభావం తగ్గి, స్టేడియాల్లో ప్రేక్షకులు లేక ఖాళీగా దర్శనమిస్తోంది. కానీ, క్రికెట్‌లో అసలు మజా టెస్టు క్రికెట్‌లోనే ఉంటుంది. అందుకే ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ను తెరపైకి తీసుకొచ్చింది. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 144 ఏళ్ల చరిత్ర కలిగిన టెస్టు క్రికెట్‌ను సరికొత్తగా ఆవిష్కరిచనుందనడంలో సందేహం లేదు.
రెండేళ్లుగా కొనసాగుతున్న డబ్ల్యూటీసీ.. ఎట్టకేలకు చివరి అంకానికి చేరువైంది. కరోనా మహమ్మారితో కొన్ని దేశాల మధ్య మ్యాచ్ లు జరగలేదు. దీంతో విజయాల శాతం ఆధారంగా ఐసీసీ భారత్, న్యూజిలాండ్ టీంలను ఫైనల్ లో చేర్చింది. కాగా, భారత్, న్యూజిలాండ్ జట్లూ బయో బడుగల్లో ఉంటూ ఫైనల్ కోసం సిద్ధమయ్యాయి. రెండూ గొప్ప జట్లను నడిపిస్తున్న సారథుల మధ్య సమరాన్ని చూసేందకు క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
ఐసీసీ ప్రవేశపెట్టిన అన్ని టోర్నీల ట్రోఫీలను భారత్ కైవసం చేసుకుంది. వన్డే, టీ20 ప్రపంచకప్‌లు, ఛాంపియన్స్ ట్రోఫీ టైటిళ్లను గెలుచుకుని ఐసీసీ ట్రోఫీల్లో తన సత్తా చాటింది. టీమిండియాకు టెస్టుల్లో ఎక్కువ విజయాలను అందించిన కెప్టెన్లలో విరాట్ కోహ్లీ ముందున్నాడు. కెప్టెన్సీతోనే కాదు.. ఆటలోనూ విరాట్ దూకుడు తగ్గలేదు. అయితే, విరాట్ హయాంలో వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్‌ట్రోఫీ టైటిళ్లు దక్కలేదు. ఈ ఛాంపియన్‌షిప్ ట్రోఫీని అందుకుని ఆ కొరత తీర్చుకోవాలని ఎదురుచూస్తున్నాడు. క్యూరేటర్ సిమన్ లీ అంచనాల మేరకు.. ఈ పిచ్ పేసర్లకు, స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందని అన్నాడు. దీంతో ఇండియా టీం ముగ్గురు పేసర్లను బరిలోకి దించనుందని తెలుస్తోంది. అలాగే స్పిన్నర్లను కూడా అదే సంఖ్యలో తీసుకుంటుందని టాక్ వినిపిస్తోంది.
హెడ్ టూ హెడ్:
భారత్, న్యూజిలాండ్ టీంలు 59 సార్లు టెస్టుల్లో తలపడ్డాయి. అయితే టీమిండియా 21 విజయాలతో ముందజంలో ఉంది. ఇక న్యూజిలాండ్ టీం 12 విజయాలను సాధించింది. మిగతా మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.
ఐసీసీ ఈవెంట్లలో..
ఇక ఐసీసీ ఈవెంట్లతో ఇండియా, న్యూజిలాండ్ టీంలు 5 సార్లు తలపడ్డాయి. అయితే ఈ ఐదుసార్లు టీమిండియా ఓటమిపాలైంది. దీంతో ఐసీసీ ఈవెంట్లలో న్యూజిలాండ్‌తే పైచేయిగా ఉంటోంది.
కీలక ఆటగాళ్లు
భారత్ నుంచి విరాట్ కోహ్లీ, పుజారా, రిషభ్ పంత్, ఇషాంత్ శర్మ కీలకంగా మారనున్నారు. మరోవైపు కివీస్ టీం నుంచి కేన్ విలియమ్సన్, ట్రెంట్ బౌల్ట్ ప్రముఖంగా కనిపిస్తున్నారు. కాగా, ముఖ్యంగా విరాట్ కోహ్లీ, ట్రెంట్ బౌల్ట్ ల మధ్య పోటీ ఆసక్తికరంగా మారనుంది. అలాగే కేన్ విలియమ్సన్, బుమ్రా ల మధ్య పోరు హోరాహోరీగా సాగనుంది.
టీంల వివరాలు:
భారత్: రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, చెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానె, రిషబ్ పంత్ (కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఇశాంత్ శర్మ, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా
న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, టామ్ లాథమ్, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, బిజె వాట్లింగ్ (కీపర్), కోలిన్ డి గ్రాండ్‌హోమ్, కైల్ జామిసన్, టిమ్ సౌతీ, నీల్ వాగ్నెర్ / అజాజ్ పటేల్, ట్రెంట్ బౌల్ట్
ఆన్-ఫీల్డ్ అంపైర్లు: రిచర్డ్ ఇల్ంగ్‌వర్త్, మైఖేల్ గోఫ్
మ్యాచ్ రిఫరీ: క్రిస్ బ్రాడ్
Also Read:
WTC Finals: డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే.. జట్టులో ఇద్దరు స్పిన్నర్లు.!