Test Cricket: సచిన్, కోహ్లీ కాదు.. టెస్ట్ క్రికెట్‌కు సరైన మొగుడు ఈ ప్లేయర్.. తొలి బంతికే సిక్స్.!

2012వ సంవత్సరంలో బంగ్లాదేశ్‌తో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్‌లో క్రిస్ గేల్ ఈ అసాధారణ రికార్డును సృష్టించాడు. ఆ మ్యాచ్‌లో డెబ్యూ బౌలర్ సోహగ్ గాజీ వేసిన తొలి బంతిని గేల్ లాంగ్ ఆన్ మీదుగా ఒక అదిరిపోయే సిక్సర్‌గా మలిచాడు. ఈ షాట్ ఆటగాళ్లతో పాటు కామెంటేటర్లను..

Test Cricket: సచిన్, కోహ్లీ కాదు.. టెస్ట్ క్రికెట్‌కు సరైన మొగుడు ఈ ప్లేయర్.. తొలి బంతికే సిక్స్.!
Test Cricket

Updated on: Jan 24, 2026 | 10:07 AM

టెస్ట్ క్రికెట్‌లో తొలి ఓవర్ తొలి బంతికి సిక్స్ కొట్టడం అత్యంత అరుదైన ఘనత. 2012లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ ఈ అద్భుత రికార్డును నెలకొల్పాడు. డెబ్యూ బౌలర్ సోహగ్ గాజీ వేసిన ఆ బంతిని గేల్ లాంగ్ ఆన్ మీదుగా సిక్సర్‌గా మలిచాడు. ఇది క్రికెట్ చరిత్రలో ఒక ప్రత్యేకమైన సందర్భం. వివరాల్లోకి వెళ్తే.. టీ20 లేదా వన్డే ఫార్మాట్‌లో తొలి ఓవర్ తొలి బంతికి సిక్స్ లేదా ఫోర్ కొట్టడం సాధారణంగా చూస్తుంటాం. కానీ టెస్ట్ క్రికెట్‌లో మొదటి ఓవర్ మొదటి బంతికి సిక్స్ కొట్టడం అనేది అత్యంత అరుదైన, దాదాపు ఊహించలేని ఘనత. క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం ఒకే ఒక బ్యాట్స్‌మెన్ ఈ రికార్డును సాధించాడు. ఆ ఘనత వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ సొంతం.

ఇది చదవండి: ‘అలా అనుకుంటే ఎన్టీఆర్‌ను అడ్డంపెట్టుకుని కొన్ని కోట్లు సంపాదించేవాడిని..’

2012వ సంవత్సరంలో బంగ్లాదేశ్‌తో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్‌లో క్రిస్ గేల్ ఈ అసాధారణ రికార్డును సృష్టించాడు. ఆ మ్యాచ్‌లో డెబ్యూ బౌలర్ సోహగ్ గాజీ వేసిన తొలి బంతిని గేల్ లాంగ్ ఆన్ మీదుగా ఒక అదిరిపోయే సిక్సర్‌గా మలిచాడు. ఈ షాట్ ఆటగాళ్లతో పాటు కామెంటేటర్లను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాకుండా, అదే ఓవర్‌లో నాలుగో బంతికి మరో సిక్సర్ కొట్టి, మొత్తంగా ఆ ఓవర్‌లో 18 పరుగులు రాబట్టాడు. టెస్ట్ క్రికెట్ ప్రారంభం కాగానే క్రిస్ గేల్ సాధించిన ఈ ఏకైక రికార్డు క్రికెట్ అభిమానులను ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: అబ్బ.! ఆర్సీబీ జట్టు కొనేందుకు లైన్‌లోకి లక్కీ లేడీ.. ఎవరో తెలిస్తే స్టన్

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..