AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK : బాయ్‌కాట్ డిమాండ్.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దు అయితే బీసీసీఐకి ఎన్ని వందల కోట్లు నష్టమో తెలుసా ?

ఏప్రిల్‌లో జరిగిన పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారతీయులలో పాకిస్తాన్‌పై కోపం ఇంకా తగ్గలేదు. అందుకే భారత్-పాకిస్తాన్ ఆసియా కప్ మ్యాచ్‌ను బహిష్కరించాలనే డిమాండ్ ఊపందుకుంది. ఈ రెండు దేశాల మధ్య జరగాల్సిన మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, చివరి నిమిషంలో ఈ మ్యాచ్ రద్దయితే ఎవరికి ఎంత నష్టం జరుగుతుంది?

IND vs PAK : బాయ్‌కాట్ డిమాండ్.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దు అయితే బీసీసీఐకి ఎన్ని వందల కోట్లు నష్టమో తెలుసా ?
India Vs Pakistan
Rakesh
|

Updated on: Sep 14, 2025 | 6:28 PM

Share

IND vs PAK : గత ఏప్రిల్‌లో జరిగిన పుల్వామా ఉగ్రదాడిపై భారతీయుల్లో ఇప్పటికీ ఆగ్రహం ఉంది. ఈ కారణంగానే భారత్-పాకిస్తాన్ ఆసియా కప్ మ్యాచ్‌ను బహిష్కరించాలనే డిమాండ్ బలంగా మారింది. ఈ బాయ్‌కాట్ ఉద్యమం దేశంలోని ప్రతి గల్లీకి చేరుకుంది. ఈ రెండు చిరకాల ప్రత్యర్థుల పోరు నేటి రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, ఒకవేళ చివరి నిమిషంలో ఈ మ్యాచ్ రద్దు అయితే ఎవరికి ఎంత నష్టం జరుగుతుంది? మ్యాచ్ యూఏఈలో జరుగుతున్నప్పటికీ, ఆతిథ్యం మాత్రం బీసీసీఐ/భారత్‌ వద్ద ఉంది. కాబట్టి, ఒకవేళ మ్యాచ్ రద్దు అయితే బీసీసీఐకి భారీగా నష్టం తప్పదా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం.

బీసీసీఐకి భారీ నష్టం

ఒకవేళ భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దు అయితే, దాని ప్రభావం మొదటగా బ్రాడ్‌కాస్టింగ్ డీల్‌పై పడుతుంది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ల వ్యూయర్‌షిప్ రికార్డులు సృష్టిస్తుంది. కానీ, ఒకవేళ ఈ ఆసియా కప్ 2025లో ఈ మ్యాచ్ జరగకపోతే దాదాపు రూ. 1500 కోట్లు విలువైన బ్రాడ్‌కాస్టింగ్ డీల్​ ఆగిపోతుంది. ఒక ఆసియా కప్ ప్రకారం చూస్తే.. ఇందులో 2025 ఆసియా కప్ వాటా రూ. 375 కోట్లు.

2024లో ఒక బీసీసీఐ అధికారి చెప్పిన వివరాల ప్రకారం.. తదుపరి నాలుగు ఆసియా కప్ ఈవెంట్లకు సంబంధించిన బ్రాడ్‌కాస్టింగ్ హక్కులను 170 మిలియన్ డాలర్లకు విక్రయించారు. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ. 1500 కోట్లుకు సమానం. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కారణంగానే బీసీసీఐకి ఇంత పెద్ద మొత్తం లభించిందనడంలో సందేహం లేదు. ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరగకపోతే, బ్రాడ్‌కాస్టర్లు బీసీసీఐని కఠినమైన ప్రశ్నలు అడుగుతారు. పరిస్థితి మరింత దిగజారితే, బీసీసీఐ ఈ కోట్ల డీల్ మధ్యలోనే రద్దు అయ్యే అవకాశం ఉంది.

బ్రాడ్‎కాస్టర్లకు కూడా నష్టం

భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ను ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది చూస్తారు. ఎక్కువ మంది చూసే వీక్షకులు ఉంటే, ప్రకటనల స్లాట్ల కోసం ప్రసారకర్త భారీ మొత్తాన్ని వసూలు చేస్తాడు. నివేదికల ప్రకారం.. ఏసీసీ, ఐసీసీ వంటి పెద్ద ఈవెంట్‌లలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లోని 10 సెకన్ల యాడ్ స్లాట్ రూ. 25-30 లక్షలుకు అమ్ముడవుతుంది. ఒకవేళ మ్యాచ్ జరగకపోతే ఏ కంపెనీ కూడా ఆ డీల్‌ను కొనసాగించాలని అనుకోదు.

అలాంటి హై-ప్రొఫైల్ మ్యాచ్‌ల కోసం పెద్ద పెద్ద కంపెనీలు స్పాన్సర్ కావడానికి క్యూలో ఉంటాయి. ప్రస్తుతం ఆసియా కప్ కోసం టీమ్ ఇండియాకు టైటిల్ స్పాన్సర్ లేదు, ఎందుకంటే ఆన్‌లైన్ గేమింగ్ చట్టం తర్వాత డ్రీమ్​11, బీసీసీఐ మధ్య ఒప్పందం ముగిసింది. ఒకవేళ భారత్-పాక్ మ్యాచ్ జరగకపోతే, బ్రాడ్‌కాస్టర్లతో పాటు స్పాన్సర్లు కూడా బోర్డును ప్రశ్నలు అడుగుతారు.

భారత్-పాకిస్తాన్ మ్యాచ్ చాలా పెద్దది. దాని టిక్కెట్లు కొద్ది నిమిషాల్లోనే అమ్ముడవుతాయి. అయితే, ఆసియా కప్ 2025 మ్యాచ్ రద్దు అయితే టిక్కెట్ల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంపై కూడా ప్రభావం పడుతుంది. అంతేకాకుండా, చివరి నిమిషంలో మ్యాచ్ రద్దు అయితే బీసీసీఐ ప్రతిష్ట కూడా దెబ్బతింటుంది.

ఈ మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ మొత్తం మూడు సార్లు తలపడవచ్చు. గ్రూప్ దశ, ఆ తర్వాత సూపర్-4 దశ, చివరిగా ఫైనల్‌లో కూడా వాటి మధ్య పోరు ఉండవచ్చు. ఈ మూడు హై-ప్రొఫైల్ మ్యాచ్‌లు బీసీసీఐకి భారీ నష్టాన్ని కలిగించవచ్చు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..