Westindies vs Australia: భారీ షాట్లు ఆడబోయి బోల్తాపడ్డావ్‌గా.. అంత అత్యుత్సాహం ఎందుకయ్యా..! విండీస్ దిగ్గజంపై నెటిజన్ల ఆగ్రహం

| Edited By: Venkata Chari

Jul 15, 2021 | 9:52 PM

వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ ఆండ్రీ రస్సెల్‌పై ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు. ఆస్ట్రేలియాతో బుధవారం రాత్రి జరిగిన 4వ టీ20 గెలిచే మ్యాచ్‌ కాగా, రస్సెల్ కారణంగా వెస్టిండీస్ పరాజయం పాలైంది.

Westindies vs Australia: భారీ షాట్లు ఆడబోయి బోల్తాపడ్డావ్‌గా.. అంత అత్యుత్సాహం ఎందుకయ్యా..! విండీస్ దిగ్గజంపై నెటిజన్ల ఆగ్రహం
Andre Russel
Follow us on

Westindies vs Australia: వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ ఆండ్రీ రస్సెల్‌పై ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు. ఆస్ట్రేలియాతో బుధవారం రాత్రి జరిగిన 4వ టీ20 గెలిచే మ్యాచ్‌ కాగా, రస్సెల్ కారణంగా వెస్టిండీస్ పరాజయం పాలైంది. ఇన్నింగ్స్ లాస్ట్ ఓవర్‌లో వెస్టిండీస్ టీం విజయానికి 11 పరుగులు కావాల్సి ఉంది. కానీ, రస్సెల్ ఆ ఓవర్‌లో కేవలం 6 పరుగులు మాత్రమే సాధించి, పరాజయం పాలైంది. ఎన్నో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడి, మ్యాచులను గెలిపించిన రస్సెల్.. కేవలం 6 పరుగులు మాత్రమే చేయడం పట్ల అభిమానులు గుర్రుగా ఉన్నారు. యార్కర్‌ను ఆడలేక ఓటమిని కొనితెచ్చుకున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కామెంట్లతో రెచ్చిపోతున్నారు. మరోవైపు చివరి ఓవర్ బౌలింగ్ చేసిన మిచెల్ స్టార్క్‌ను కొనియాడుతున్నారు.

చివరి ఓవర్‌లో రస్సెల్ ఆడిన షాట్లకు సింగిల్స్, డబుల్స్ తీయోచ్చని, కానీ రన్స్ తీయకపోవడం వల్లే ఓడిపోయిందని ఫ్యా్న్స్ కామెంట్లు చేస్తున్నారు. ఫస్ట్ బాల్‌ మిడ్ వికెట్ మీదకు ఆడబోయి కిందపడ్డాడు. అలాగే మిగతా బంతుల్లో షాట్‌లు ఆడాడు కానీ, రన్స్ మాత్రం తీయలేదు. భారీ షాట్లు ఆడాలనే అత్యుత్యాహంతో మ్యాచ్‌లో ఓటమి ఎదురైందని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఓవర్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

మ్యాచ్ విషయానికి వస్తే.. నాలుగో టీ20లో భాగంగా ఆస్ట్రేలియా జట్టు మొదట బ్యాటింగ్ చేసి 6 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఇందులో మార్ష్ 75 పరుగులు, కెప్టెన్ ఆరోన్ ఫించ్ 53 పరుగులతో రాణించారు. వీరితో పాటు డాన్ క్రిస్టియన్ 14 బంతుల్లో 22 నాటౌట్‌గా నిలిచాడు. వెస్టిండీస్ బౌలర్లలో హెడెన్ వాల్ష్ 3 వికెట్లు సాధించాడు. అనంతరం 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ టీం ధాటిగానే ఇన్నింగ్స్ ఆరంభించింది. సిమన్స్ 48 బంతుల్లో 72 పరుగులు చేయగా, లూయిస్ 14 బంతుల్లో 31 పరుగులు చేసి ఔటయ్యారు. అనంతరం మిడిలార్డర్ చాలా ఘోరంగా విఫలమైంది. ఆండ్రీ రస్సెల్ 13 బంతుల్లో 24 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫాబియన్ అలెన్ 14 బంతుల్లో 29 పరుగులు చేశాడు. అయితే రస్సెల్ చివరి ఓవర్లో పరుగులేమి చేయకపోవడంతో వెస్టిండీస్ జట్టు ఓటమిపాలైంది.

Also Read:

Ganguly Biopic: తెర మీదకి రానున్న గంగూలీ బయోపిక్..!! హీరో ఎవరంటే..?? వీడియో

Tokyo Olympics 2021: మీ పతకం మీరే.. కరోనాతో మారిన ఒలింపిక్ రూల్స్..!

IND vs SL: అక్కడ 9 ఏళ్లుగా టీమిండియాకు ఎదురులేదు.. ఈ రికార్డును సీనియర్ ప్లేయర్ కొనసాగించేనా?