IND vs WI, 1st ODI: దంచి కొట్టిన భారత్.. విండీస్ ముందు భారీ టార్గెట్.. ధావన్ సెంచరీ మిస్
నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 7 వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసింది. దీంతో వెస్టిండీస్ ముందు 309 పరుగుల భారీ టార్గెట్ ఉంచింది.
భారత్, వెస్టిండీస్ టీంల మధ్య తొలి వన్డే పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్‌లో జరుగుతోంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 7 వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసింది. దీంతో వెస్టిండీస్ ముందు 309 పరుగుల భారీ టార్గెట్ ఉంచింది. 53 బంతుల్లో 64 పరుగులు చేసిన శుభ్‌మన్ గిల్ రనౌట్ అయ్యాడు. అదే సమయంలో ధావన్ బ్యాటింగ్ 97 పరుగులు చేసి సెంచరీకి కేవలం 3 పరుగుల దూరంలో పెవిలియన్ చేరాడు. ఇక వెస్టిండీస్ బౌలర్లలో జోసఫ్ 2, షీఫర్డ్ 1, మోతీ 2, హోషైన్ 1 వికెట్ పడగొట్టారు.
ఈ క్రమంలో ధావన్ తన వన్డే కెరీర్‌లో 18వ సెంచరీని కోల్పోయాడు. 2019 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై గబ్బర్ చివరి సెంచరీ సాధించాడు. శ్రేయాస్ అయ్యర్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 54 పరుగుల వద్ద ఔటయ్యాడు.
శ్రేయాస్ అయ్యర్, శిఖర్ ధావన్ రెండో వికెట్‌కు 97 బంతుల్లో 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్‌లు తొలి వికెట్‌కు 105 బంతుల్లో 119 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కెప్టెన్ ధావన్ 53 బంతుల్లో 50, శుభ్‌మన్ గిల్ 52 బంతుల్లో 64 పరుగులు చేశారు.
గాయం కారణంగా రవీంద్ర జడేజా జట్టులో స్థానం దక్కలేదు. అతని స్థానంలో అక్షర్ పటేల్‌కు అవకాశం దక్కింది.
భారత ప్లేయింగ్ ఎలెవన్: శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ (కీపర్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్ మరియు ప్రణంద్ కృష్ణ.
వెస్టిండీస్ ప్లేయింగ్ XI: షాయ్ హోప్ (కీపర్), బ్రాండన్ కింగ్, షమ్రా బ్రూక్స్, నికోలస్ పూరన్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్, అకిల్ హొస్సేన్, రొమారియో షెపర్డ్, కైల్ మేయర్స్, గుడాకేష్ మోతీ, అల్జారీ జోసెఫ్, జాడెన్ సిల్స్.