Dwayne Bravo: డ్వేన్ బ్రావో.. క్రికెట్ అభిమానులకు ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఫార్మట్ ఏదైనా తన అద్భుత ఆటతీరుతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడీ వెస్టిండిస్ ఆల్ రౌండర్. ఇప్పటికే ఎన్నో అరుదైన రికార్డులను సొంతం చేసుకున్న బ్రావో తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ఫార్మాట్‌లో ఏకంగా 600 వికెట్లు పడగొట్టి సరకొత్త చరిత్రకు నాంది పలికాడు. టీ20 ఫార్మాట్‌లో ఈ ఫీట్ సాధించిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఆగస్టు 11న ఓవల్ ఇన్విజిబుల్స్ జట్టుతో ఆడిన మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసి తాజా రికార్డ్ నమోదు చేశాడు.
2021 టీ20 వరల్డ్ కప్ సమయంలో రిటైర్మెంట్ ప్రకటించిన బ్రావో.. ప్రస్తుతం లీగ్‌లలో క్రికెట్ ఆడుతున్నాడు. ఇందులో భాగంగా తాజాగా ది హండ్రెడ్ లీగ్‌లో ఆడుతున్నాడు. ఓవల్ మైదానంలో ఇన్విజిబుల్స్ జట్టుతో జరిగిన టీ20 మ్యాచ్‌లో అదరగొట్టాడు. రిలీ రొస్సౌను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేసిన బ్రావో.. రెండో వికెట్‌గా సామ్ కరెన్‌ను క్లీన్ బౌల్డ్ చేసి 600వ వికెట్ తీశాడు. బ్రావో టీ20 కెరీర్ విషయానికొస్తే 2006లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి టీ20 మ్యాచ్ ఆడాడు. మొత్తం 91 ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్‌ల్లో 78 వికెట్లు పడగొట్టాడు. వివిధ లీగ్ మ్యాచుల్లో 522 వికెట్లు పడగొట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 161 మ్యాచులు ఆడిన బ్రావో 183 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
Slow deliveries ? Bravo! Spectacular bowling from the superstar @DJBravo47.
Watch all the action from The Hundred LIVE, exclusively on #FanCode ?https://t.co/3GLSe3BlEE@thehundred#TheHundred #TheHundredonFanCode pic.twitter.com/BRNYIenclH
— FanCode (@FanCode) August 12, 2022
క్రికెట్‌తోనే కాకుండా సింగర్, డ్యాన్సర్, నటుడిగానూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు బ్రావో. మహిళలకు సంబంధించి పలు సమస్యలపై సామాజిక అవగాహన కల్పించే చిత్రాల్లో నటించాడు. తుమ్ బిన్2 బాలీవుడ్ చిత్రం కోసం గాయకుడిగా మారాడు. మ్యూజిక్ కంపోజర్ అంకిత్ తివారీతో కలిసి పాటలను ఆలపించాడు. బ్రావో పాడి, డ్యాన్స్ చేసిన వీడియో ‘డీజే బ్రావో’గా ప్రసిద్ధికెక్కింది. ఈ వీడియో బ్రావోను సింగర్‌గా మార్చేసింది.