Dwayne Bravo: నేడు చివరి టీ20 మ్యాచ్ ఆడనున్న డ్వేన్ బ్రావో.. గెలుపుతో ఆట ముగిస్తాడా..

|

Nov 06, 2021 | 3:23 PM

T20 World Cup 2021: వెస్టిండీస్‎ను రెండుసార్లు టీ20 ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన డ్వేన్ బ్రావో శనివారం ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‎లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నాడు. గురువారం శ్రీలంకతో తన జట్టు ఓడిపోయిన తరువాత, ఐసీసీ పోస్ట్-మ్యాచ్ ఫేస్‌బుక్ లైవ్ షోలో మాజీ కెప్టెన్ డారెన్ సామీ,వ్యాఖ్యాత అలెక్స్ జోర్డాన్‌లతో మాట్లాడుతూ తన రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు చెప్పాడు బ్రావో...

Dwayne Bravo: నేడు చివరి టీ20 మ్యాచ్ ఆడనున్న డ్వేన్ బ్రావో.. గెలుపుతో ఆట ముగిస్తాడా..
Bravo
Follow us on

T20 World Cup 2021: వెస్టిండీస్‎ను రెండుసార్లు టీ20 ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన డ్వేన్ బ్రావో శనివారం ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‎లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నాడు. గురువారం శ్రీలంకతో తన జట్టు ఓడిపోయిన తరువాత, ఐసీసీ పోస్ట్-మ్యాచ్ ఫేస్‌బుక్ లైవ్ షోలో మాజీ కెప్టెన్ డారెన్ సామీ,వ్యాఖ్యాత అలెక్స్ జోర్డాన్‌లతో మాట్లాడుతూ తన రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు చెప్పాడు బ్రావో. “సమయం వచ్చిందని నేను భావిస్తున్నాను,” అని బ్రావో చెప్పాడు. “నేను చాలా మంచి కెరీర్‌ను కలిగి ఉన్నాను. 18 సంవత్సరాలుగా వెస్టిండీస్‌కు ప్రాతినిధ్యం వహించడం గొప్ప విషయం, కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నాను” అని అన్నాడు. “మూడు ICC ట్రోఫీలు గెలవడం నేను గర్విస్తున్న విషయం” అని అన్నాడు.

బ్రావో వెస్టిండీస్ తరఫున 90 టీ20 మ్యాచ్‎లుఆడాడు. 1000 కంటే ఎక్కువ పరుగులు చేసి 78 వికెట్లు తీశాడు. బ్రావో 2004లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 164 మ్యాచ్‎లు ఆడిన బ్రావో 2968 పరుగులు చేశాడు. 199 వికెట్లు పడగొట్టాడు. 40 టెస్ట్‎లు ఆడి 2200 పరుగులు చేశాడు. 86 వికెట్లు తీశాడు. బ్రావో డెత్ ఓవర్లలో బాగా బ్యాటింగ్ చేస్తాడని పేరు ఉంది. 2012లో వెస్టిండీస్ మొదటిసారి T20 ప్రపంచ కప్‌ను గెలుచుకున్నప్పుడు బ్రావో విన్నింగ్ క్యాచ్ పట్టాడు. 38 ఏళ్ల బ్రావో 17 సంవత్సరాలకు పైగా అంతర్జాతీయ క్రికెట్ ఆడారు.

ఆస్ట్రేలియాతో మ్యాచ్‎లో గెలిచి డ్వేన్ బ్రావోకు ఘనంగా వీడ్కోలు పలకాలని వెస్టిండీస్ ఆటగాళ్లు భావిస్తున్నారు. ఇప్పటికే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిన ఆ జట్టు చివరి గేమ్‌లో విజయం సాధించాలని ఎదురుచూస్తోంది. ఇంతకు ముందు ఆడిన 4 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా 3 గెలిచి 1 ఓడిపోయింది. కాగా, ఈ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. అదే సమయంలో, టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిన వెస్టిండీస్ కథ దీనికి విరుద్ధంగా ఉంది. ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 1 గెలిచి 3 ఓడింది.

Read Also.. Virat Kohli Birthday: ధోని కెప్టెన్సీలో కోహ్లీ పుట్టిన రోజు వేడుకలు.. రచ్చ చేసిన టీంమేట్స్.. వైరలవుతోన్న వీడియో

Watch Video: రోహిత్, రాహుల్ బౌండరీలు, సిక్సర్ల వర్షం.. మ్యాచ్ హైలైట్స్ చూసేయండి