వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ ప్రపంచవ్యాప్తంగా వివిధ టీ20 లీగ్‌లలో ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అబుదాబి T10 లీగ్‌లోనూ సందడి చేశాడు. రస్సెల్ టోర్నమెంట్‌లో నార్తర్న్ వారియర్స్ తరపున ఆడాడు. బ్యాట్, బాల్ రెండింటిలో సహకారం అందించడంతో జట్టులో కీలక పాత్ర పోషించేవాడు.
ఇప్పటి వరకు ఫాస్ట్ బౌలర్లే ఎక్కువ బౌన్సర్లు వేస్తుండడం చూస్తుంటాం. కానీ, ఓ స్పిన్నర్ బౌన్సర్ విసిరితే ఎలా ఉంటుందో చూశారా? అయితే తప్పకుండా ఈ వీడియో చూడాల్సిందే.
బంగ్లా టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ కైస్ అహ్మద్ షాకింగ్ బౌన్సర్‌తో క్రీజులోనే కుప్పకూలిపోయాడు. వారియర్స్ ఇన్నింగ్స్‌లోని ఆరో ఓవర్‌లో రస్సెల్ 11 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. అయితే, స్పిన్ బౌలింగే కదా అని రస్సెల్ హెల్మెట్ ధరించలేదు. బంతి తక్కువ ఎత్తులో వస్తుందని ఊహించాడు. కానీ, బౌన్సర్‌గా రావడంతో షాక్‌కు గురయ్యాడు. అయితే, ఇది రెండేళ్ల క్రితం జరిగిన మ్యాచ్‌కు సంబంధించిన వీడియో. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..