క్రైస్ట్‌చర్చ్ టెస్టు (New Zealand vs South Africa, 2nd Test) లో న్యూజిలాండ్ పరిస్థితి దారుణంగా తయారైంది. దక్షిణాఫ్రికా జట్టు మ్యాచ్‌పై గట్టి పట్టు సాధిస్తోంది. అయితే నాలుగో రోజు ఆటలో కివీ జట్టు ఆటగాడు విల్ యంగ్ తన అత్యుత్తమ ఫీల్డింగ్‌తో నెట్టింట్లో వైరల్‌గా మారాడు. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో విల్ యంగ్(Will Young) ఓ ఆశ్చర్యకరమైన క్యాచ్ పట్టాడు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మ్యాచ్‌లో కామెంట్రీ చేస్తున్న మాజీ క్రికెటర్లు కూడా ఇలాంటి క్యాచ్ ఎలా పట్టుకున్నాడో నమ్మలేకపోయారు. విల్ యంగ్ దక్షిణాఫ్రికా ఆటగాడు మార్కో యాన్సన్ అందించిన అద్భుత క్యాచ్‌ను పట్టాడు. డీన్ గ్రాండ్‌హోమ్‌ను యాన్సన్ ఓ భారీ షాట్ కొట్టాడు. అయితే, విల్ యంగ్ బౌండరీ లైన్‌లో అద్భుతమైన క్యాచ్(Will Young Catch)ని పట్టుకోవడంతో ఈ సౌతాఫ్రికా ఆటగాడి ఇన్నింగ్స్‌ను ముగిసింది.
మార్కో యాన్సన్ లాంగ్ ఆన్, మిడ్‌వికెట్ మధ్య అద్భుతమైన షాట్ ఆడాడు. అయితే, విల్ యంగ్ తన ఎడమవైపున ఉన్న బంతికి దగ్గరగా పరిగెత్తాడు. ఆపై ఒక్క ఉదుటున దూకి బంతిని ఒక చేత్తో పట్టుకున్నాడు. విల్ యంగ్ క్యాచ్ పట్టిన వీడియో నిజంగా షాకింగ్‌గా ఉంది. యంగ్ ఇలాంటి క్యాచ్ పట్టాడంటే న్యూజిలాండ్ ఆటగాళ్లు కూడా నమ్మలేకపోతున్నారు.
క్వింటన్ డి కాక్ ఆకస్మిక రిటైర్మెంట్ తర్వాత వికెట్ కీపర్‌గా బాధ్యతలు స్వీకరించిన కైల్ వెర్న్ తొలి సెంచరీతో న్యూజిలాండ్‌తో సోమవారం జరిగిన రెండో క్రికెట్ టెస్ట్ నాలుగో రోజు దక్షిణాఫ్రికా తమ పైచేయి సాధించింది. వెర్న్ అజేయంగా 136 పరుగులు చేయడంతో దక్షిణాఫ్రికా టీకి ముందు 9 వికెట్ల నష్టానికి 354 పరుగుల వద్ద తమ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి, న్యూజిలాండ్ ముందు 425 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ తర్వాత ఆతిథ్య జట్టు 94 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
కగిసో రబాడ 34 బంతుల్లో 47 పరుగులతో కెరీర్‌లో అత్యుత్తమంగా ఆడడం ద్వారా వెరీన్‌కు మంచి మద్దతు ఇచ్చాడు. ఆ తర్వాత రబాడ న్యూజిలాండ్ ఓపెనర్లు కెప్టెన్ టామ్ లాథమ్ (1), విల్ యంగ్ (0) ఇద్దరినీ పెవిలియన్‌కు పంపి తొమ్మిది పరుగులకే రెండు వికెట్లు సాధించాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్ కివీస్ ప్లేయర్స్ హెన్రీ నికోల్స్ (07), డారిల్ మిచెల్ (24)లను అవుట్ చేసి న్యూజిలాండ్ కష్టాలను మరింత పెంచాడు. ట ముగిసే సమయానికి డెవాన్ కాన్వే 60 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ టామ్ బ్లండెల్ ఒక పరుగుతో మరో ఎండ్‌లో నిలిచాడు.
వారు కచ్చితంగా టీమిండియా అభిమానులు కాదు.. అలాంటి ఆలోచనలకు మందే లేదు: ట్రోలర్స్‌పై షమీ ఘాటు వ్యాఖ్యలు