MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్మెంట్? కీలక అప్‌డేట్ ఇచ్చిన టీమిండియా మాజీ ప్లేయర్

ఈ సీజన్‌లో చెన్నై కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు ధోని మార్గనిర్దేశం చేస్తున్నాడు. గైక్వాడ్ కెప్టెన్సీలో చెన్నై 6 మ్యాచ్‌ల్లో 4 గెలిచి మొత్తం 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ధోనీ కూడా ఈ సీజన్‌లో తన బ్యాటింగ్‌తో అభిమానులకు ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇస్తున్నాడు. ముంబైకి వ్యతిరేకంగా, అతను ఇన్నింగ్స్ చివరి ఓవర్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్సర్లు కొట్టాడు. అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్‌పై 16 బంతుల్లో 37 నాటౌట్‌గా నిలిచాడు.

MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్మెంట్? కీలక అప్‌డేట్ ఇచ్చిన టీమిండియా మాజీ ప్లేయర్
MS Dhoni

Updated on: Apr 15, 2024 | 5:20 PM

MS Dhoni Retirement: ఎంఎస్ ధోని ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీని రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే. ఇదే ధోనీకి చివరి సీజన్‌గా భావిస్తున్నారు. ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం తర్వాత, ధోనీ రిటైర్మెంట్ గురించి భారత దేశీయ వెటరన్ వసీం జాఫర్ కీలక ప్రకటన చేశాడు.

నిన్న ముంబై ఇండియన్స్‌పై చెన్నై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. చెన్నై సాధించిన ఈ అద్భుత విజయంలో ధోని నాలుగు బంతుల్లో 20 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆ తర్వాత, సోమవారం అతను ధోని రిటైర్మెంట్ గురించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు. ఎవరూ ఊహించని విధంగా ధోనీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరిచేవాడంటూ తెలిపాడు.

ఇవి కూడా చదవండి

అతను సోషల్ మీడియా పోస్ట్‌లో- ఎంఎస్ ధోని ఎప్పుడూ ఎవరూ ఊహించని పనులు చేస్తాడు. ముఖ్యంగా అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ విషయంలో ఇదే జరిగింది. ఈ ఐపీఎల్ తర్వాత రిటైర్ అవుతాడని ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు.. మీరే రెస్ట్ తీసుకోండి’ అంటూ చెప్పుకొచ్చాడు.

ధోని బ్యాటింగ్ భీభత్సం..

ఈ సీజన్‌లో చెన్నై కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు ధోని మార్గనిర్దేశం చేస్తున్నాడు. గైక్వాడ్ కెప్టెన్సీలో చెన్నై 6 మ్యాచ్‌ల్లో 4 గెలిచి మొత్తం 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ధోనీ కూడా ఈ సీజన్‌లో తన బ్యాటింగ్‌తో అభిమానులకు ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇస్తున్నాడు. ముంబైకి వ్యతిరేకంగా, అతను ఇన్నింగ్స్ చివరి ఓవర్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్సర్లు కొట్టాడు. అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్‌పై 16 బంతుల్లో 37 నాటౌట్‌గా నిలిచాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..