రిషబ్ పంత్ 2023 ప్రపంచకప్ ఆడగలడా? లేదా? గతంలో BCCI నుండి మెడికల్ అప్‌డేట్ వచ్చిన తర్వాత ఈ ప్రశ్నలు తలెత్తడం ప్రారంభించాయి. గతంలో బోర్డు పంత్ ఫిట్‌నెస్ అప్‌డేట్ ఇచ్చింది. పంత్ చాలా వేగంగా కోలుకుంటున్నాడని, బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడని బోర్డు తెలిపింది. పంత్ కోలుకోవడం చూస్తుంటే, అతనికి ప్రపంచకప్ఆడిపించాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే పంత్ ఫిట్‌గా ఉన్నప్పటికీ ప్రపంచకప్ ఆడకూడదని భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అన్నాడు. పంత్ గురించి మాట్లాడుతూ టోర్నీ ప్రారంభమయ్యే సమయానికి ఫిట్‌గా మారినప్పటికీ ప్రపంచకప్ ఆడకూడదని అన్నాడు. అతను టీమ్ ఇండియాకు ముఖ్యమైన ఆటగాడని, భవిష్యత్తులో టీమ్ ఇండియాకు కూడా కెప్టెన్‌గా కూడా వ్యవహరిస్తాడన్నాడు. ఇటువంటి పరిస్థితిలో పంత్ తొందరపడకూడదు. కోలుకోవడానికి పూర్తి సమయం తీసుకోవాలి. రిషబ్ పంత్ పూర్తిగా ఫిట్‌గా తిరిగి రావడానికి కొంత సమయం పడుతుందని చెప్పాడు. పంత్ ప్రపంచకప్ ఆడతాడని తాను భావించడం లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు జాఫర్.
కాగా గత ఏడాది చివర్లో పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.ఈ ప్రమాదంలో పంత్‌కు కూడా చాలా గాయాలయ్యాయి. అతనికి శస్త్రచికిత్స కూడా చేయాల్సి వచ్చింది. పంత్ పరిస్థితి చూస్తుంటే, అతను తిరిగి మైదానంలోకి రావడానికి చాలా సమయం పట్టవచ్చని భావించారు. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. 2 నెలల క్రితమే ఊతకర్రల సాయంతో నడుస్తూ కనిపించాడు. అదే సమయంలో, అతను నెట్స్‌లో వికెట్ కీపింగ్ చేయడం ప్రారంభించాడు. దీంతో పంత్ ప్రపంచకప్‌లో ఆడతారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఇదే సమయంలో భవిష్యత్ దృష్ట్యా అతనికి మరింత విశ్రాంతి అవసరమని జాఫర్ సూచించడం గమనార్హం.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..