చెన్నైపై సన్‌రైజర్స్ ఘన విజయం

ఐపీఎల్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మళ్లీ పుంజుకుంది. ఇటీవల హ్యాట్రిక్ ఓటములతో కాస్త డీలాపడినట్లు కనిపించిన టీమ్.. బుధవారం రాత్రి ఉప్పల్‌లో బౌలింగ్, బ్యాటింగ్‌లో జూలు విదిల్చి చెన్నై సూపర్ కింగ్స్‌పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేయగా.. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (50: 25 బంతుల్లో 10×4), జానీ బెయిర్‌స్టో (61 నాటౌట్: 44 బంతుల్లో 3×4, 3×6) అర్ధశతకాలు బాదడంతో […]

చెన్నైపై సన్‌రైజర్స్ ఘన విజయం

Edited By:

Updated on: Apr 18, 2019 | 6:11 AM

ఐపీఎల్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మళ్లీ పుంజుకుంది. ఇటీవల హ్యాట్రిక్ ఓటములతో కాస్త డీలాపడినట్లు కనిపించిన టీమ్.. బుధవారం రాత్రి ఉప్పల్‌లో బౌలింగ్, బ్యాటింగ్‌లో జూలు విదిల్చి చెన్నై సూపర్ కింగ్స్‌పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేయగా.. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (50: 25 బంతుల్లో 10×4), జానీ బెయిర్‌స్టో (61 నాటౌట్: 44 బంతుల్లో 3×4, 3×6) అర్ధశతకాలు బాదడంతో లక్ష్యాన్ని 16.5 ఓవర్లలోనే సన్‌రైజర్స్ 137/4తో అలవోకగా ఛేదించింది. వరుసగా మూడు విజయాల తర్వాత మళ్లీ చెన్నై జట్టు ఓడిపోగా.. వరుసగా మూడు ఓటముల తర్వాత హైదరాబాద్ గెలుపు రుచి చూసింది. ఉప్పల్‌లో ఓడినప్పటికీ.. 14 పాయింట్లతో చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. సీజన్‌లో నాలుగో విజయాన్ని అందుకున్న హైదరాబాద్ జట్టు 8 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది.