VVS Laxman: ఎన్‎సీఏ హెడ్‌గా బాధ్యతలు చేపట్టిన వీవీఎస్ లక్ష్మణ్.. కొత్త సవాల్ అంటూ వ్యాఖ్యలు..

|

Dec 14, 2021 | 10:43 AM

భారత మాజీ బ్యాటర్ VVS లక్ష్మణ్ సోమవారం నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) హెడ్‌గా బాధ్యతలు స్వీకరించాడు. తన మొదటి రోజు అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు...

VVS Laxman: ఎన్‎సీఏ హెడ్‌గా బాధ్యతలు చేపట్టిన వీవీఎస్ లక్ష్మణ్.. కొత్త సవాల్ అంటూ వ్యాఖ్యలు..
Laxman
Follow us on

భారత మాజీ బ్యాటర్ VVS లక్ష్మణ్ సోమవారం నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) హెడ్‌గా బాధ్యతలు స్వీకరించాడు. తన మొదటి రోజు అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. లక్ష్మణ్ ట్విట్టర్‌లో కార్యాలయంలోని చిత్రాలను పోస్ట్ చేసి, “NCAలో మొదటి రోజు! అద్భుతంగా ఉంది. కొత్త సవాలు ఎదురు కానుంది. భారత క్రికెట్ భవిష్యత్ కోసం పనిచేయడం గొప్ప అవకాశం” అని రాశాడు. గత నెలలో భారత మాజీ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఎన్‌సీఏ అధిపతిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ధృవీకరించారు.

భారత మాజీ కెప్టెన్ గంగూలీ ఆటను అభివృద్ధి చేయడంలో మాజీ క్రికెటర్లను భాగం చేయాల్సిన అవసరం ఉందన్నారు. BCCI అధ్యక్షుడిగా అతను రాహుల్ ద్రవిడ్‌ను భారత జట్టు ప్రధాన కోచ్‌గా అంగీకరించేలా కృషి చేశాడు. BCCI చీఫ్ మాత్రమే కాదు, సెక్రటరీ జే షా, ఇతర సీనియర్ అధికారులు కూడా లక్ష్మణ్ NCA పాత్రను చేపట్టాలని కోరారు. ఎందుకంటే BCCI గత కొన్ని సంవత్సరాలుగా NCA హెడ్‌ని దగ్గరగా చూస్తోంది.

భారత్ హెడ్ కోచ్‎గా రాహుల్ ద్రవిడ్, ఎన్‎సీఏ హెడ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ భారత క్రికెట్‌ని ముందుకు తీసుకెళ్లేందుకు కలిసి పనిచేయడం మంచి పరిణామం అనిబీసీసీఐ వర్గాలు తెలిపాయి.

Read Aslo… IND Vs SA: నెట్స్‎లో చెమటోడ్చిన కేఎల్ రాహుల్.. వైరల్ అయిన వీడియో..