VVS Laxman: మరో పదేళ్లు క్రికెట్‌లో టీమిండియా అధిపత్యం.. వీవీఎస్ లక్ష్మణ్ కామెంట్స్
క్రికెట్‌లో టీమ్ ఇండియా అధిపత్యం కొనసాగుతోంది. ఒక్క టెస్ట్ మ్యాచ్‌లో లేక పొట్టి ఫార్మట్‌లో కాదు.. మూడు ఫార్మట్‌లో భారత్ బలంగా ఉంది. తాజాగా ఈ విషయంపై బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్(బీసీఈ) చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
క్రికెట్లో టీమిండియా అధిపత్యం కొనసాగుతోంది. ఒక్క టెస్ట్ మ్యాచో లేక పొట్టి ఫార్మట్‌లో కాదు.. మూడు ఫార్మట్‌లో భారత్ బలంగా ఉంది. తాజాగా ఈ విషయంపై బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్(బీసీఈ) చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ స్పందించాడు. ఇంటర్నేషనల్‌లో క్రికెట్ మరో 10 ఏండ్లు టీమిండియా హవానే కొనసాగుతుందన్నారు. సత్తా చాటడానికి టీమిండియాకు చాలా మంది ఆటగాళ్లు ఉన్నట్లు చెప్పారు. కావాల్సింత మంది ఆటగాళ్లు ఉన్నట్లు వివరించారు. తను 2021లో బీసీఈ చీఫ్ బాధ్యతలు స్వీకరించానని, తాను ఆయిష్టంగానే బాధ్యతలు స్వీకరించినప్పటికి క్రమక్రమంగా తనకు పనిచేయడం మంచి అనుభవాన్ని ఇచ్చినట్లు చెప్పారు. టీమ్ ఇండియాలో స్టార్ ప్లేయర్లే కాకుండా బెంచ్‌లో ఉన్నవారు కూడా స్ట్రాంగ్‌గా ఉన్నట్లు చెప్పారు.
అందుకే టీమిండియా ఇంత బలంగా అంతర్జాతీయ క్రికెట్లో కూడా అధిపత్యం కొనసాగిస్తుందని వివరించారు. భారత జట్టు సామర్థ్యం, ప్రతిభ ఉన్నవారిని చూడడం మంచి అనుభవాన్ని ఇస్తుందన్నారు. రాబోయే 10 ఏండ్లు అంతర్జాతీయ క్రికెట్లో భారత్ ఆటగాళ్లు సత్తా చాటుతారని చెప్పారు. దేశ ప్రజలను టీమిండియా ఆటగాళ్లు గర్వపడేలా చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. పురుషుల క్రికెట్‌లోనే కాదు ఉమెన్ క్రికెటర్స్ కూడా ఆద్భుతంగా ఆడుతున్నారన్నారు. టీమిండియా మహిళా ఆటగాళ్లు కూడా బాగా ప్రతిభ చూపెడుతున్నారని కొనియాడారు.
ఈ నెల 3 నుంచి ఉమెన్స్ టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా టీమిండియా మహిళా ఆటగాళ్లు ఎంతోగాను శ్రమిస్తున్నారని ఆయన తెలిపారు. వాళ్లు పడుతున్న శ్రమ చూస్తుంటే తనకు గర్వంగా ఉందని చెప్పారు. ఇప్పటి వరకు 8 సార్లు మహిళల టీ20 ప్రపంచకప్ జరగగా, 6 సార్లు ఆస్ట్రేలియా, ఒక్కసారి ఇంగ్లాండ్, మరోసారి వెస్టిండీస్ టైటిల్ గెలుచుకున్నాయి. భారత్ ఒక్కటి కూడా ఇప్పటి వరకు గెలువలేదు. ఈ టీ20 ప్రపంచ కప్‌లో మొత్తం పది జట్టు ఉంటాయి.