భారత క్రికెట్ లో దిగ్గజ ఆటగాళ్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్. ఇప్పుడు ఈ ఇద్దరి వారసత్వాన్ని కొనసాగించే పనిలో ఉన్నారు వీరి కుమారులు. సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. అలాగే ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ కూడా అండర్ 19 క్రికెట్ పోటీలకు ఎంపికయ్యాడు. ఇక తాజాగా మరో వెటరన్ ప్లేయర్ కొడుకు రంగంలోకి దిగబోతున్నాడు. టీమిండియా డ్యాషింగ్ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ ఢిల్లీ అండర్-19 జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆర్యవీర్ సెహ్వాగ్ ఇప్పుడు 2024-25 దేశీయ సీజన్ కోసం విను మన్కడ్ ట్రోఫీ ODI టోర్నమెంట్‌లో ఆడబోతున్నాడు. వీను మన్కడ్ టోర్నీ అక్టోబర్ 4 నుంచి పాండిచ్చేరిలో జరగనుంది. ప్రణవ్ పంత్ ఢిల్లీ అండర్-19 కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కాగా సార్థక్ రే జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు గతంలో ఢిల్లీ అండర్-16 జట్టు తరఫున చాలా మ్యాచ్‌లు ఆడాడు. ఇప్పుడు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు. కాగా ఆర్యవీర్ సెహ్వాగ్ కు టీమ్ ఇండియా తరఫున టెస్టు మ్యాచ్ ఆడాలనేది కల.
వీరేంద్ర సెహ్వాగ్ భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో క్రికెట్ ఆడాడు. భారత్ తరఫున టెస్టు క్రికెట్‌లో రెండు ట్రిపుల్ సెంచరీలు చేసిన ఏకైక బబ్యాటర్. అతను 2007 T20 ప్రపంచ కప్ , 2011 ODI ప్రపంచ కప్ గెలిచిన భారత్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. టీమిండియా తరఫున 104 టెస్టు మ్యాచ్‌ల్లో 8586 పరుగులు, 251 వన్డేల్లో 8273 పరుగులు చేశాడు. ఇది కాకుండా టీ20 ఇంటర్నేషనల్స్‌లో 394 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 38 సెంచరీలు కూడా సాధించాడు.
Aryavir Sehwag, son of Virender Sehwag, has been selected for the Delhi U19 team for Vinoo Mankad Trophy.
Delhi U19 squad for Vinoo Mankad Trophy: pic.twitter.com/14nLYxpDYm
— Varun Giri (@Varungiri0) September 28, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..