గత కొన్ని నెలలుగా భారత జాతీయ జట్టులోకి ఎంతోమంది ఆటగాళ్లు చోటు సంపాదించుకుంటున్నారు. వారిలో కొంతమంది మంచి ప్రదర్శనలు కనబరిచి తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు. అటు టీమిండియా బెంచ్ కూడా అమోఘమైన టాలెంట్‌తో నిండి ఉంది. సీనియర్ ప్లేయర్స్ స్థానాన్ని భర్తీ చేసేందుకు యువ ప్లేయర్స్ ఎందరో ఉన్నారు. ఈ తరుణంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుత వన్డే ఓపెనర్ శిఖర్ ధావన్‌ను రీ-ప్లేస్ చేయగల సత్తా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఓపెనర్ దేవదూత్ పడిక్కల్‌కు ఉందని అభిప్రాయపడ్డాడు.
ఎడమ చేతివాటం బ్యాట్స్‌మెన్ అయిన దేవదూత్ పడిక్కల్ ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్నాడు. అతడికి ఇదే తొలి అంతర్జాతీయ సిరీస్. రెండో టీ20 ద్వారా అరంగేట్రం చేసిన పడిక్కల్.. ఆ మ్యాచ్‌లో కేవలం 29 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అటు మూడో మ్యాచ్‌లో 9 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఈ రెండు టీ20ల్లోనూ చెప్పుకోదగ్గ ప్రదర్శనలు ఇవ్వనప్పటికీ.. ఫ్యూచర్‌లో ఓపెనర్ ధావన్ స్థానాన్ని పడిక్కల్ భర్తీ చేయగలుగుతాడని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. పడిక్కల్ ధోని వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. అతడు పలు సందర్భాల్లో ధోనిని.. తాను ఇన్స్పిరేషన్‌గా తీసుకుంటున్నట్లు వివరించాడు.
డొమెస్టిక్ క్రికెట్‌లో దేవదూత్ పడిక్కల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో పడిక్కల్ టోర్నమెంట్ అంతటికి టాప్ స్కోరర్(609)గా నిలిచాడు. మాజీ క్రికెటర్లు సైతం పడిక్కల్ బ్యాటింగ్ శైలిపై ప్రశంసలు కురిపించారు. తాజాగా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ సెహ్వాగ్ మీడియాతో మాట్లాడాడు. పడిక్కల్‌ను ధావన్ వారసుడిగా అభివర్ణించాడు. ”అతడు బాగా ఆడాలని కోరుకుంటున్నా. పడిక్కల్ ఆడే తీరు అద్భుతంగా ఉంటుంది. ఐపీఎల్‌లో సెంచరీ, ఇంకా మంచి ఇన్నింగ్స్‌లు ఎన్నో పడిక్కల్ తన ఖాతాలో వేసుకున్నాడు. రెండు మ్యాచ్‌లతో అతడిలో ఉన్న సామర్ధ్యాన్ని అంచనా వేయలేం. శిఖర్ ధావన్ నిష్క్రమణ తర్వాత అతడి స్థానాన్ని భర్తీ చేయగలిగిన బ్యాట్స్‌మెన్ పడిక్కల్ మాత్రమేనని” సెహ్వాగ్ పేర్కొన్నాడు. కాగా, పడిక్కల్‌తో సహా యువ క్రికెటర్లందరికి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాలి. మొదటిగా ఇండియా పిచ్‌లపై వారు సత్తా చాటితే.. ఖచ్చితంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో ఆడేందుకు కాన్ఫిడెన్స్ వస్తోందని సెహ్వాగ్ స్పష్టం చేశాడు.
Also Read:
14 బంతుల్లో తుఫాన్ ఇన్నింగ్స్.. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డ సన్‌రైజర్స్ ఓపెనర్.!
ధైర్యమంటే ఇదేనేమో.. భారీ నాగుపాముతో యువతి సయ్యాట.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!