
టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ ఆధ్యాత్మిక చింతనలో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. ఇప్పటికే పలు దేవాలయాలను సందర్శిస్తూ, స్వామిజీల ఆశీర్వాదాలు అందుకున్నాడు. ఇటీవల కోహ్లీ బృందావనంలోని సెయింట్ ప్రేమానంద మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇప్పుడు ఐపీఎల్ బిజీ షెడ్యూల్ మధ్య భార్య అనుష్క శర్మతో కలిసి మే 25న రామ్ నగరి అయోధ్య చేరుకున్నాడు. దాదాపు 1000 సంవత్సరాల పురాతనమైన హనుమాన్ గర్హి ఆలయానికి వెళ్లి ప్రార్థనలు చేశాడు. అనుష్కతో కలిసి ఆలయంలో చాలా సమయం గడిపాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఐపీఎల్ లీగ్ దశ మ్యాచ్‌ల కోసం విరాట్ కోహ్లీ కొన్ని రోజులు లక్నోలో బస చేస్తున్నాడు. మే 23న లక్నోలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 25 బంతుల్లో 43 పరుగులు చేశాడు. ఎస్‌ఆర్‌హెచ్‌పై ఆర్సీబీ ఓటమి పాలైంది. తర్వాత మ్యాచ్ మే 27న లక్నోలో ఆతిథ్య జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ఎస్‌ఆర్‌హెచ్, లక్నోతో మ్యాచ్‌ల మధ్య 4 రోజుల గ్యాప్ దొరకడంతో విరాట్ అనుష్కతో కలిసి అయోధ్యకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆయన హనుమాన్ గర్హి ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రార్థనలు చేశారు. కాగా ఇటీవలె కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. 2024లో టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ ఇకపై టీమిండియా తరపున వన్డేల్లో మాత్రమే ఆడనున్నాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..