భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లి మెల్బోర్న్ ఎయిర్‌పోర్టులో కొందరు మీడియా వ్యక్తులతో వాగ్వాదానికి దిగారు. ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్‌లో ముగిసిన మూడవ టెస్ట్ తర్వాత, కోహ్లి తన కుటుంబంతో కలిసి ఎయిర్‌పోర్టులో ఉన్న సమయంలో ఈ సంఘటన జరిగింది. తన ప్రైవేట్ జీవితాన్ని మీడియా దృష్టి నుండి దూరంగా ఉంచాలని కోరుకునే కోహ్లి, తన కుటుంబ సభ్యులు మరియు పిల్లలను మీడియా కెమెరాలు చిత్రీకరిస్తున్నప్పుడు అసహనానికి లోనయ్యారు. అయితే, ఇది కేవలం ఒక అపార్థం అని తర్వలోనే తేలింది.
రిపోర్టుల ప్రకారం, కొన్ని జర్నలిస్టులు ఆస్ట్రేలియా పేసర్ స్కాట్ బోలాండ్‌ను ఇంటర్వ్యూ చేస్తుండగా, కోహ్లి తన కుటుంబంతో అక్కడకు వచ్చారు. కెమెరాలు ఒక్కసారిగా కోహ్లి వైపు మళ్లడంతో, ఆయన ఆగ్రహం వ్యక్తపరిచారు.
“నా పిల్లలతో ఉన్నప్పుడు నాకు ప్రైవసీ అవసరం. మీరు అనుమతి లేకుండా చిత్రీకరించ కూడదు” అని కోహ్లి అన్నారు. చానెల్ 7 కెమెరాలు కోహ్లి కుటుంబంపై దృష్టి పెట్టడంతో, ఆయన ఒక టీవీ రిపోర్టర్‌తో తీవ్ర సంభాషణకు దిగారు. అయితే, ఆయన పిల్లలను చిత్రీకరించలేదని హామీ ఇవ్వగానే పరిస్థితి చక్కబడింది. ఆ హామీ తర్వాత, కోహ్లి చానెల్ 7 కెమెరామన్‌తో చేతులు కలిపి పరిస్థితే సానుకూలంగా ముగించారు.
క్రికెట్ పరంగా చూసుకుంటే, ఈసారి కోహ్లికి ఆస్ట్రేలియాలో పెద్దగా ఫలితాలు దక్కలేదు. పర్త్ టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించినప్పటికీ, మిగతా నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 26 పరుగులకే పరిమితమయ్యారు.
బోర్డర్-గావాస్కర్ ట్రోఫీ ప్రస్తుతం 1-1తో సమస్థాయిలో ఉంది. ఇండియా పర్త్‌లో విజయం సాధించగా, ఆస్ట్రేలియా అడిలైడ్‌లో గెలిచి సమం చేసింది. బ్రిస్బేన్ టెస్టు వర్షం కారణంగా డ్రాగా ముగిసింది.ఇప్పుడు, డిసెంబర్ 26న ప్రారంభమయ్యే బాక్సింగ్ డే టెస్టులో రెండు జట్లు మరోసారి తలపడనున్నాయి.
Indian cricket superstar Virat Kohli has been involved in a fiery confrontation at Melbourne Airport. @theodrop has the details. https://t.co/5zYfOfGqUb #AUSvIND #7NEWS pic.twitter.com/uXqGzmMAJi
— 7NEWS Melbourne (@7NewsMelbourne) December 19, 2024