Watch Video: పాక్ ఓటమితో వెక్కివెక్కి ఏడ్చిన విరాట్ కోహ్లి లేడీ ఫ్యాన్.. కన్నీళ్లు ఆపుకోలేక స్టేడియంలోనే అలా.. వైరల్ వీడియో..
Virat Kohli Pakistani Fan: ఆసియా కప్ 2022లో శ్రీలంక 23 పరుగుల తేడాతో పాక్ జట్టును ఓడించి, ట్రోఫిని సొంతం చేసుకుంది.
Virat Kohli Pakistan Fan: ఆసియా కప్ 2022లో ఆదివారం నాడు శ్రీలంక, పాకిస్తాన్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో 23 పరుగుల తేడాతో పాక్ జట్టును ఓడించి, ఆసియా కప్ 2022 ట్రోఫిని శ్రీలంక జట్టు కైవసం చేసుకుంది. పాకిస్థాన్ ఓటమి తరువాత, క్రికెట్ ఆటగాళ్లతోపాటు, అభిమానులు కూడా భావోద్వేగానికి గురయ్యారు. అయితే, ఇందులో ఓ విరాట్ కోహ్లీ అభిమాని కూడా ఉంది. ఇటీవల ఆసియా కప్‌లో పాపులర్ అయిన విరాట్ కోహ్లీ అభిమానిగా పేరుగాంచిన ఓ పాకిస్తానీ అమ్మాయి.. మళ్లీ వార్తల్లో నిలిచింది. ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ‘లవ్ ఖానీ’ పరుతో ఎంతో పాపులర్ అయింది. అయితే, పాకిస్తాన్ ఓటమి తర్వాత ఆమె చేసిన సందేశం దీనికి కారణంగా నిలిచింది. పాకిస్థాన్ గెలవలేకపోతే భారత్ గెలిచి ఉండేదని, అది తనకు సంతోషాన్ని కలిగించిందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియోను పంచుకుంది.
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో లంక అభిమానులను అభినందిస్తున్న సమయంలో ఆమె కళ్లలో నీళ్లు తిరుగుతున్నట్లు వీడియోలో చూడొచ్చు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో సందడి చేస్తోంది. లంకేయులకు ఈ విజయం.. కేవలం క్రికెట్ గురించి మాత్రమే కాదు, అంతకు మించి ఉంది. ప్రస్తుతం అక్కడి పరిస్థితులు అంత బాగోలేవు. ఈ క్రమంలో ఈ విజయం రాజకీయ ప్రాముఖ్యత కలిగి ఉంది.
View this post on Instagram
View this post on Instagram
దుబాయ్ వేదికగా జరిగిన 2022 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక 23 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. చివరి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 170 పరుగులు చేసింది. జవాబుగా పాకిస్థాన్ జట్టు 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎనిమిదేళ్ల తర్వాత శ్రీలంక ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. శ్రీలంక ఆరోసారి ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
వనిందు హసరంగా, భానుక రాజపక్సే శ్రీలంక ఈ అద్భుతమైన విజయానికి హీరోలుగా నిలిచారు. బంతితో పాటు బ్యాట్‌తోనూ హస్రంగ అద్భుత ప్రదర్శన చేశాడు. హసరంగా మొదట 21 బంతుల్లో 36 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం బౌలింగ్ లో ముఖ్యమైన మూడు వికెట్లు తీసుకున్నాడు. మరోవైపు రాజపక్సే 71 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. అదే సమయంలో యువ ఫాస్ట్ బౌలర్ ప్రమోద్ మధుషన్ కూడా ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 34 పరుగులకే నాలుగు వికెట్లు తీశాడు.
మరిన్ని క్రికెట్ వార్తలు చదవండి