గత కొన్నేళ్లుగా టీమిండియా వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ జట్టు విజయాల్లో కీలక భాగంగా ఉండటమే కాదు.. క్లిష్ట సమయాల్లో చక్కటి ఇన్నింగ్స్‌లతో చేజ్ మాస్టర్‌గా పేరుగాంచాడు. అంతేకాదు భారత జట్టుకు రన్ మిషన్‌గా వ్యవహరిస్తున్న కోహ్లీ.. రాబోయే రెండు నెలల్లో జరిగే ఆసియా కప్, వన్డే వరల్డ్‌కప్ 2023లో రాణించడం చాలా ముఖ్యం. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఆసియా కప్ 2023 కోసం బెంగళూరులో ముమ్మరంగా ప్రాక్టిస్ చేస్తున్నాడు. తనదైన శైలి షాట్స్, మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్‌లతో రెచ్చిపోయేందుకు అస్త్రశస్త్రాలు సిద్దం చేస్తున్నాడు. ఈ తరుణంలో విరాట్ కోహ్లీ చెత్త రికార్డు ఒకటి టీమిండియా ఫ్యాన్స్‌ను సతమతమయ్యేలా చేస్తోంది.
శ్రీలంకలో కోహ్లీకి చెప్పుకోదగ్గ రికార్డు లేదు. అలాగే 2010లో జరిగిన ఆసియా కప్‌లో కోహ్లీ అత్యంత పేలవ ప్రదర్శన కనబరిచాడు. 11, 18, 10, 28 వెరిసి మొత్తంగా 67 పరుగులు ఆ సమయంలో కోహ్లీ చేసినవి. గతేడాది ఆసియా కప్ ముందు వరకు కూడా కోహ్లీ పేలవ ఫామ్ కొనసాగింది. అయితే ఆ తర్వాత కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి రావడం.. వరుసగా మెరుపు ఇన్నింగ్స్‌లు కొట్టడం జరిగింది. ఇక విరాట్ కోహ్లీకి ఆసియా కప్ వన్డే ఫార్మాట్‌లో మంచి లెక్కలే ఉన్నాయి. మూడు సెంచరీలతో 613 పరుగులు చేశాడు. అలాగే గతేడాది టీ20 ఫార్మాటులో జరిగిన ఆసియా కప్‌లోనూ కోహ్లీ 147.59 స్ట్రైక్ రేట్‌తో 276 పరుగులు చేశాడు.
Forever grateful 🙏 pic.twitter.com/cpxoUNS0uG
— Virat Kohli (@imVkohli) August 18, 2023
మరోవైపు ఆసియా కప్ 2023 మెగా టోర్నమెంట్ ఆగష్టు 30వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఇక టీమిండియా తన తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 2న పాకిస్తాన్‌తో పల్లెకల్లెలో జరుగుతుంది. సెప్టెంబర్ 4న భారత్, నేపాల్ జట్లు తలబడనున్నాయి.
🚨 NEWS 🚨
IDFC First acquires title sponsorship rights for all BCCI international and domestic home matches.
Details 🔽
— BCCI (@BCCI) August 25, 2023
Here’s the Rohit Sharma-led team for the upcoming #AsiaCup2023 🙌#TeamIndia pic.twitter.com/TdSyyChB0b
— BCCI (@BCCI) August 21, 2023
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ