Asia Cup 2023: వాఘా బోర్డర్ మీదుగా పాక్‌లో అడుగుపెట్టనున్న బీసీసీఐ బాస్‌లు! 15 ఏళ్ల తర్వాత దాయాది దేశంలోకి..
ఆగస్ట్ 30 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ 2023కి పాకిస్థాన్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మెగా టోర్నీ ప్రారంభ వేడుకలకు హాజరవ్వాల్సిందిగా బీసీసీఐ ఇతర ఆసియా క్రికెట్ బోర్డులను సాదరంగా ఆహ్వానించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ). కాగా పాకిస్థాన్ బోర్డు ఆహ్వానాన్ని బీసీసీఐ తిరస్కరించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత టోర్నీని వీక్షించేందుకు బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, బోర్డు వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా పాకిస్థాన్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
ఆగస్ట్ 30 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ 2023కి పాకిస్థాన్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మెగా టోర్నీ ప్రారంభ వేడుకలకు హాజరవ్వాల్సిందిగా బీసీసీఐ ఇతర ఆసియా క్రికెట్ బోర్డులను సాదరంగా ఆహ్వానించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ). కాగా పాకిస్థాన్ బోర్డు ఆహ్వానాన్ని బీసీసీఐ తిరస్కరించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత టోర్నీని వీక్షించేందుకు బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, బోర్డు వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా పాకిస్థాన్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు దీని గురించి ఖచ్చితమైన సమాచారం బయటకు వచ్చింది, BCCI ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, బోర్డు వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా పాకిస్తాన్‌లో జరుగుతున్న ఆసియా కప్ మ్యాచ్‌లను చూడటానికి సెప్టెంబర్ 4 న పాకిస్తాన్‌కు వెళ్లనున్నట్లు టైమ్స్ నౌ నివేదించింది. దీని గురించి రోజర్ బిన్నీ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ‘బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, నేను సెప్టెంబర్ 4 న వాఘా సరిహద్దు మీదుగా పాకిస్తాన్‌కు వెళ్తాం. అధికారిక విందులో పాల్గొనడంతో పాటు రెండు మ్యాచ్‌లను చూడబోతున్నాం’ అని బీసీసీఐ అధ్యక్షులు చెప్పుకొచ్చారు.
సెప్టెంబర్ 7న తిరిగి ఇండియాకు..
BCCI వర్గాల సమాచారం ప్రకారం, బిన్నీ, శుక్లా సెప్టెంబర్ 5, 6 తేదీలలో లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్ vs శ్రీలంకతో పాటు సూపర్ ఫేజ్ మ్యాచ్‌ను చూస్తారు. ఆ తర్వాత ఈ ఇద్దరూ సెప్టెంబర్ 7న ఇండియాకు తిరిగొస్తారని సమాచారం. ఒక వేళ ఇదే నిజమైతే ముంబై తాజ్ హోటల్ దాడి జరిగిన సరిగ్గా 15 ఏళ్ల తర్వాత బీసీసీఐ ప్రతినిథులు పాకిస్థాన్‌లో అడుగుపెట్టనున్నారు. పాకిస్తాన్‌కు వెళ్లే ముందు, సెప్టెంబర్ 2న పల్లెకెలెలో పాకిస్తాన్ వర్సెస్ భారత్‌ల మధ్య జరిగిన హై-వోల్టేజ్ యుద్ధాన్ని చూడటానికి బిన్నీ శ్రీలంకకు వెళ్లనున్నారు. ఆ తర్వాత వీరిద్దరూ పాకిస్థాన్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. అంతకుముందు, దక్షిణాఫ్రికాలో జరిగిన సమావేశంలో పీసీబీ ఛైర్మన్ జాకా అష్రాఫ్ బీసీసీఐ కార్యదర్శి ప్రస్తుత ఏసీసీ ప్రెసిడెంట్ జైషాను ఆహ్వానించారు. దీనికి జై షా కూడా అంగీకరించినట్లు పాక్ మీడియా పేర్కొంది. అయితే ఈ వార్తలు అవాస్తవమని బీసీసీఐ పేర్కొంది. అలాగే, ఆటగాళ్ల మాదిరిగానే బీసీసీఐ ప్రతినిధులు పాకిస్థాన్‌కు వెళ్లాలంటే భారత ప్రభుత్వం నుంచి అనుమతి పొందాలని బీసీసీఐ సీనియర్ అధికారిని ఉటంకిస్తూ ఇన్‌సైడ్ స్పోర్ట్ నివేదించింది.
ముంబై దాడుల తర్వాత తొలిసారి..
BCCI president Roger Binny confirms he will travel to Lahore on September 4 and watch Asia Cup matches there. Welcome ♥️
‘I have no hesitation is traveling to Pakistan, I had memorable visits in the past and Pakistanis are very hospitable. I hope this visit helps towards our… pic.twitter.com/AjIDmdJgWg
— Farid Khan (@_FaridKhan) August 27, 2023
వాఘా సరిహద్దు మీదుగా దాయాది దేశంలోకి…
The BCCI president Roger Binny and Vice President Rajiv Shukla will travel to Pakistan to watch the Asia Cup match. pic.twitter.com/SjO8dXCQPK
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 25, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..