Indian Cricket Team: కెప్టెన్సీ వివాదంపై మౌనం వీడిన చీఫ్ సెలక్టర్.. కోహ్లీ ప్రకటనపై కీలక వ్యాఖ్యలు..!

|

Jan 01, 2022 | 6:39 AM

Virat Kohli vs Chetan Sharma: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు టీమిండియాను ప్రకటించిన తర్వాత, చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ విరాట్ కోహ్లీ వివాదంపై కీలక ప్రకటన చేశాడు.

Indian Cricket Team: కెప్టెన్సీ వివాదంపై మౌనం వీడిన చీఫ్ సెలక్టర్.. కోహ్లీ ప్రకటనపై కీలక వ్యాఖ్యలు..!
Virat Kohli Vs Sourav Ganguly
Follow us on

Virat Kohli vs Chetan Sharma: దక్షిణాఫ్రికాతో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) శుక్రవారం భారత జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ ఫిట్‌గా లేడని, ఇలాంటి పరిస్థితుల్లో కేఎల్ రాహుల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. మరోవైపు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. దీనితో పాటు, జట్టును ప్రకటించిన తర్వాత, చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ విరాట్ కోహ్లీ విషయంపై మౌనం వీడారు.

కోహ్లీపై చేతన్ శర్మ ఏం చెప్పాడంటే..!
టీమ్ ఇండియాను ప్రకటించిన తర్వాత, విరాట్ కోహ్లీపై చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ మాట్లాడుతూ, “2021 టీ20 ప్రపంచకప్‌కు ముందు కెప్టెన్సీ నుంచి వైదొలగడం గురించి విరాట్ కోహ్లీ మాకు చెప్పాడు. ఈ నిర్ణయాన్ని పునరాలోచించమని మేమంతా ఆయన్ను కోరాం. ఆ సమయంలో జట్టు పెద్ద టోర్నమెంట్ ఆడబోతోంది. కాబట్టి పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఒకే ఒక్క కెప్టెన్ ఉంటాడని మేం వారికి చెప్పలేదు.

చీఫ్ సెలక్టర్ ఫోన్ కాల్‌లో ఏం జరిగిందో చెప్పాడు..
విరాట్ కోహ్లీ నుంచి వన్డే జట్టు కెప్టెన్సీని తీసుకోవాలనే నిర్ణయం పూర్తిగా సెలెక్టర్లదేనని చేతన్ శర్మ అన్నారు. అతను ఇంకా మాట్లాడుతూ, “టెస్టు జట్టు ఎంపికకు 90 నిమిషాల ముందు వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తొలగించడం గురించి నేను చెప్పాను. నేనే కోహ్లీకి ఫోన్ చేశాను. విరాట్ కోహ్లీతో నేను బాగానే మాట్లాడాను” అని తెలిపాడు.

సౌరవ్ గంగూలీ వాదనను విరాట్ కోహ్లీ ఖండించాడు..
సౌరవ్ గంగూలీ ప్రకటనకు విరుద్ధంగా, నా నిర్ణయంతో ఎవరికీ ఇబ్బంది లేదు అని విరాట్ కోహ్లీ అన్నాడు. టీ20 కెప్టెన్సీని వదులుకోవద్దని ఎవరూ నన్ను కోరలేదు. టీ20 కెప్టెన్సీని వదులుకోవడం గురించి బీసీసీఐకి మొట్టమొదటగా నేనే చెప్పాను. అది నాకు చాలా బాగా నచ్చింది. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదు. టీ20 కెప్టెన్సీని వదులుకోవద్దని నాకు ఎవరూ చెప్పలేదు. కానీ నా ఆ నిర్ణయానికి మాత్రం ప్రశంసలు వచ్చాయి” అని తెలిపాడు.

సౌరవ్ గంగూలీ ఏం చెప్పాడంటే..!
వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లిని తొలగించిన తర్వాత ఓ ఇంటర్వ్యూలో దాదా మాట్లాడుతూ, “టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగవద్దని మేం విరాట్ కోహ్లీని అభ్యర్థించాం. కానీ, విరాట్ ఈ స్థానంలో కొనసాగడానికి ఇష్టపడలేదు. టీ20 కెప్టెన్సీని వదులుకోవద్దని తాను స్వయంగా కోహ్లీకి విజ్ఞప్తి చేశానని గంగూలీ చెప్పాడు. అయితే పనిభారం గురించి మాట్లాడుతూ విరాట్ టీ20 కెప్టెన్సీని వదులుకోవడంపై మొండిగా ఉన్నాడు’ అని పేర్కొన్నాడు.

Also Read: India vs South Africa: రోహిత్ శర్మ వారసుడిగా ఆ కీలక ప్లేయర్.. ప్రకటించిన చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ..!

వన్డే జట్టులోకి వచ్చేశారు.. రోహిత్‌ స్థానంలో దేశవాళీ ఆటగాడు.. హార్దిక్‌ పాండ్యా స్థానంలో మరో ఆల్‌రౌండర్..