Virat Kohli: గందరగోళానికి దారి తీసిన విరాట్ కోహ్లీ పోస్టు .. విడాకుల ప్రకటనగా భావించిన అభిమానులు

|

Nov 21, 2024 | 11:17 AM

భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ తన సోషల్ మీడియాలో చేసిన తాజా పోస్టు అభిమానుల్లో గందరగోళం సృష్టించింది. ఇటీవల ఏఆర్ రెహమాన్ మరియు సైరా బాను విడాకుల వార్తల నేపథ్యంలో, కోహ్లీ పోస్టు ఫార్మాట్, కంటెంట్ చూసి కొందరు అభిమానులు ఆయన కూడా అనుష్క శర్మతో విడాకులు ప్రకటించబోతున్నారని భావించారు. చివరికి ఇది ఆయన ఫిట్‌నెస్ బ్రాండ్ గురించి మాత్రమేనని అభిమానులు అర్థం చేసుకున్నారు. పోస్టుకు ఎటువంటి క్యాప్షన్ లేకపోవడంతో ఈ గందరగోళం తలెత్తింది.

Virat Kohli: గందరగోళానికి దారి తీసిన విరాట్ కోహ్లీ పోస్టు .. విడాకుల ప్రకటనగా భావించిన అభిమానులు
Virat Kohli Anushka Sharma
Follow us on

భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ తన సోషల్ మీడియా పోస్ట్‌తో అభిమానుల్లో గందరగోళాన్ని సృష్టించారు. ఈ మధ్య కాలంలో ఏఆర్ రెహమాన్, ఆయన భార్య సైరా బాను మధ్య విడాకుల వార్తలు రావడం, అలాగే కోహ్లీ పోస్ట్ ఫార్మాట్ కూడా అదే రీతిలో ఉండటంతో అభిమానులు పొరపడ్డారు. విరాట్ కోహ్లీ కూడా తన భార్య అనుష్క శర్మతో విడుపోతున్నారని దానికి సంబంధించిన విడాకుల విడాకుల ప్రకటన చేసి ఉంటారని అందరు భావించారు.

కోహ్లీ తన పోస్ట్‌లో, “గతాన్ని చూసుకుంటే, మేము ఎప్పుడూ విభిన్నంగా ఉన్నాము. వారు మమ్మల్ని పెట్టాలనుకున్న ఏ డబ్బాలోనూ సరిపోలలేదు. ఇద్దరు వింతగా కనిపించే వాళ్ళం, కానీ కలిసిపోయాం,” అని ప్రారంభించారు. “ఇతరులు మమ్మల్ని పిచ్చివాళ్లని పిలిచారు, కొందరు మమ్మల్ని అర్థం చేసుకోలేదు. కానీ నిజంగా? మేము పట్టించుకోలేదు. మేము మా ప్రయాణాన్ని అర్థం చేసుకుంటూ ఉన్నాం. ఎన్నో ఒడిదుడుకులు, కోవిడ్ వంటి కష్టకాలాలను ఎదుర్కొన్నా మేము నిలబడగలిగాము,” అని అన్నారు.

అయితే, ఈ మెసేజ్ చివరలో కోహ్లీ తన ఫిట్‌నెస్ బ్రాండ్ గురించి ప్రస్తావించడంతో అసలు విషయం బయటపడింది. ఈ పోస్టుకు ఎటువంటి క్యాప్షన్ లేకపోవడంతో, అభిమానులు విడాకుల ప్రకటనగా భావించారు.

కోహ్లీ పోస్టుపై అభిమానులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందించారు. ఒక అభిమాని స్పందిస్తూ, “ముందు మాకు ఏఆర్ రెహమాన్ ప్రకటచ చేసినట్లు ఇంకేదో అనిపించింది,” అని కామెంట్ చేశారు. మరొకరు, “ఇది విడాకుల ప్రకటనల ఫార్మాట్‌లో ఎందుకు ఉందని అనిపించింది,” అని చమత్కరించారు. ఇంకొక అభిమాని నవ్వుతూ, “ఈ ఫార్మాట్‌ను మార్చండి, సర్, ప్లీజ్,” అని కామెంట్ చేశారు.

ఈ గందరగోళం తర్వాత అభిమానులు రిలీఫ్ ఫీలవ్వడం, దీనిని సరదాగా తీసుకోవడం కనిపించింది. విరాట్ కోహ్లీ పోస్టు చివరికి తన ఫిట్‌నెస్ బ్రాండ్‌ ప్రమోషన్‌గా మారడంతో అది మరింత ఆసక్తిని కలిగించింది.