
Virat Kohli : సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. రాంచీలో జరిగిన మొదటి వన్డేలో 135 పరుగుల సెంచరీతో అదరగొట్టిన కోహ్లీ, రాయ్‌పూర్‌లో జరిగిన రెండవ వన్డేలో కూడా హాఫ్ సెంచరీతో (50) మెరిశాడు. ఇది విరాట్‌కు వరుసగా మూడో 50 లేదా అంతకంటే ఎక్కువ స్కోరు కావడం విశేషం. కోహ్లీ ఫామ్‌ను భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సైతం మెచ్చుకోవాల్సి వచ్చింది.
విరాట్ కోహ్లీ 47 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేయగానే, స్టేడియం అంతా కోహ్లీ! కోహ్లీ! నినాదాలతో దద్దరిల్లింది. విరాట్ ఒక పరుగు తీసి తన ఫిఫ్టీ పూర్తి చేయగానే, కెమెరా అప్పటికప్పుడు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వైపు తిరిగింది. సాధారణంగా మైదానంలో నిశ్శబ్దంగా ఉండే గంభీర్, కోహ్లీ ఇన్నింగ్స్‌ను మెచ్చుకుంటూ చప్పట్లు కొట్టడం కనిపించింది. ఐపీఎల్‌లో వీళ్లిద్దరి మధ్య ఉన్న తీవ్రమైన పోటీ నేపథ్యంలో కోచ్‌గా గంభీర్ ఇలా బహిరంగంగా కోహ్లీని అభినందించడం అభిమానుల దృష్టిని బాగా ఆకర్షించింది. అంతేకాకుండా వన్డే క్రికెట్ చరిత్రలో కోహ్లీ వరుసగా మూడు లేదా అంతకంటే ఎక్కువ ఇన్నింగ్స్‌లలో 50+ స్కోరు చేయడం ఇది 13వ సారి.
Gautam Gambhir appreciating Virat Kohli’s fifty. pic.twitter.com/Qh40EfiDF9
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 3, 2025
సాధారణంగా సింగిల్స్, డబుల్స్ లేదా బౌండరీలతో తన ఖాతా తెరిచే విరాట్ కోహ్లీ.. రాయ్‌పూర్‌లో మాత్రం అద్భుతం చేశాడు. వన్డే క్రికెట్ చరిత్రలోనే మొదటిసారిగా, రాయ్‌పూర్ మ్యాచ్‌లో సిక్స్‌తో తన ఖాతా తెరిచాడు. లుంగీ ఎంగిడి వేసిన షార్ట్ బాల్‌ను విరాట్ పుల్ చేసి, బంతిని స్క్వేర్ లెగ్ బౌండరీ దాటించాడు. ఈ షాట్ దాదాపు 80 మీటర్ల దూరం వెళ్లింది. సాధారణంగా ఇలాంటి రిస్కీ పుల్ షాట్‌లను కిందకు ఆడే కోహ్లీ, ఈసారి మాత్రం దూకుడుగా ఆడటం అతని కొత్త ఉద్దేశాలను స్పష్టం చేస్తోంది.
Virat kohli To Ngidi Six pic.twitter.com/6ShjgYGrrA
— MAHESH (@_MAHESHICT) December 3, 2025
విరాట్ తన ఆటతీరును రాంచీ వన్డేలోనే మార్చుకున్నాడు. ఆ మ్యాచ్‌లో బరిలోకి దిగగానే రెండు సిక్స్‌లు కొట్టిన కోహ్లీ, తన 135 పరుగుల ఇన్నింగ్స్‌లో మొత్తం ఏడు సిక్స్‌లు బాదాడు. బౌండరీలతోనే ఎక్కువ పరుగులు చేసే విరాట్, ఇప్పుడు సిక్స్‌లపై దృష్టి పెట్టడం..అగ్రెస్సివ్ గా ఆడటానికి సిద్ధంగా ఉన్నట్లు చూపిస్తోంది. ఇది అతని అభిమానులకు పెద్ద బహుమతిలాంటిదే.
రాయ్‌పూర్ వన్డేలో టీమిండియా ఆరంభం అంత బాగా లేదు. గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ ఈసారి కేవలం 14 పరుగులకే అవుట్ అయ్యాడు. నాండ్రే బర్గర్ ఓవర్‌లో వరుసగా మూడు ఫోర్లు కొట్టి మంచి ఆరంభాన్నిచ్చినా, వెంటనే వికెట్ కోల్పోయాడు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా 38 బంతుల్లో 22 పరుగులు చేసి, ఒక చెత్త షాట్ ఆడి పెవిలియన్ చేరాడు. దీంతో టాప్ ఆర్డర్ త్వరగా వికెట్లు కోల్పోయింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..