Harshit Rana : గెలిచినా దెబ్బ పడింది..బ్రెవిస్‌ను ఔట్ చేసి అతి చేసిన హర్షిత్ రాణాకు ఐసీసీ అక్షింతలు
సౌతాఫ్రికాతో రాంచీలో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో భారత్ విజయం సాధించినప్పటికీ, భారత పేసర్ హర్షిత్ రాణా మాత్రం ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినందుకు చిక్కుల్లో పడ్డాడు. మ్యాచ్‌లో ప్రత్యర్థి బ్యాటర్ ఔట్ అయిన తర్వాత అగ్రెసివ్ చర్యలు ప్రదర్శించినందుకు గాను ఐసీసీ అతన్ని అధికారికంగా రిప్రైమాండ్ (చీవాట్లు) చేసింది.

Harshit Rana : సౌతాఫ్రికాతో రాంచీలో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో భారత్ విజయం సాధించినప్పటికీ, భారత పేసర్ హర్షిత్ రాణా మాత్రం ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినందుకు చిక్కుల్లో పడ్డాడు. మ్యాచ్‌లో ప్రత్యర్థి బ్యాటర్ ఔట్ అయిన తర్వాత అగ్రెసివ్ చర్యలు ప్రదర్శించినందుకు గాను ఐసీసీ అతన్ని అధికారికంగా రిప్రైమాండ్ (చీవాట్లు) చేసింది. ఆటగాళ్లు తమ ప్రవర్తనను అదుపులో ఉంచుకోవాలని ఐసీసీ మరోసారి గట్టి మెసేజ్ పంపింది.
హర్షిత్ రాణా ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ లోని ఆర్టికల్ 2.5 ను ఉల్లంఘించినట్లు తేలింది. ఈ ఆర్టికల్ ప్రకారం ఒక అంతర్జాతీయ మ్యాచ్‌లో బ్యాటర్ ఔట్ అయిన తర్వాత, అతన్ని కించపరిచేలా లేదా అతను దూకుడుగా స్పందించేలా చేసే భాష, చర్యలు లేదా సంజ్ఞలు వాడటం నిషేధం. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో 22వ ఓవర్‌లో, హర్షిత్ రాణా ప్రొటీస్ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ను అవుట్ చేసిన తర్వాత, డ్రెస్సింగ్ రూమ్ వైపు చూపిస్తూ అతిగా సంజ్ఞలు చేశాడు. ఈ చర్య ప్రత్యర్థి బ్యాటర్‌ను రెచ్చగొట్టేలా ఉందని మ్యాచ్ రిఫరీలు భావించారు.
ఈ ఉల్లంఘన కారణంగా రాణా క్రమశిక్షణ రికార్డులో ఒక డీమెరిట్ పాయింట్ ఇచ్చింది. అలాగే అతనికి అధికారిక రిప్రైమాండ్ విధించారు. హర్షిత్ రాణా తాను చేసిన తప్పును అంగీకరించడంతో పాటు, మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్ విధించిన శిక్షను అంగీకరించారు. దీంతో ప్రత్యేక విచారణ అవసరం లేకుండా పోయింది. లెవెల్ 1 ఉల్లంఘనలకు కనీస శిక్ష అధికారిక రిప్రైమాండ్ కాగా, గరిష్టంగా మ్యాచ్ ఫీజులో 50 శాతం వరకు జరిమానా విధించవచ్చు.
ఈ ఉత్కంఠభరితమైన తొలి వన్డేలో ఆతిథ్య భారత్ జట్టు సౌతాఫ్రికా పై 17 పరుగుల తేడాతో విజయం సాధించి 1-0 ఆధిక్యం సంపాదించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా, విరాట్ కోహ్లీ అద్భుతమైన 135 పరుగుల సెంచరీ (ఇది అతని 52వ వన్డే సెంచరీ), రోహిత్ శర్మ (57), కేఎల్ రాహుల్ (60) మెరుపు హాఫ్ సెంచరీల సహాయంతో 349/8 పరుగుల భారీ స్కోరు సాధించింది.
350 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు రాణా (రికల్టన్, డి కాక్‌ను అవుట్ చేసి), అర్ష్‌దీప్ సింగ్ (మార్క్‌రమ్‌ను అవుట్ చేసి) గట్టి షాక్ ఇచ్చారు. అయినప్పటికీ, మాథ్యూ బ్రీట్జ్కే, టోనీ డి జోర్జీ, డెవాల్డ్ బ్రెవిస్ పోరాట పటిమ కనబరిచారు. ముఖ్యంగా మార్కో జాన్సెన్ దూకుడు ఇన్నింగ్స్, కార్బిన్ బాష్ పోరాటంతో మ్యాచ్ చివరి ఓవర్ వరకు వెళ్ళింది. వరి ఓవర్లో 19 పరుగులు అవసరం కాగా, ప్రసిద్ధ్ కృష్ణ చివరి వికెట్ (బాష్) తీయడంతో భారత్ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు కీలక వికెట్లు పడగొట్టి విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




