Virat Kohli : చరిత్ర సృష్టించిన కింగ్ కోహ్లీ..సచిన్ రికార్డును బ్రేక్ చేసి సరికొత్త వరల్డ్ రికార్డు
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ మైదానంలోకి అడుగుపెడితే రికార్డులు బద్దలు కావడం సర్వసాధారణంగా మారింది. ఆదివారం సౌతాఫ్రికాతో రాంచీలో జరిగిన మొదటి వన్డేలో కూడా అదే జరిగింది. కోహ్లీ కేవలం 102 బంతుల్లోనే 100 పరుగులు పూర్తి చేసి, తన వన్డే కెరీర్‌లో 52వ సెంచరీని నమోదు చేశాడు.

Virat Kohli : భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ మైదానంలోకి అడుగుపెడితే రికార్డులు బద్దలు కావడం సర్వసాధారణంగా మారింది. ఆదివారం సౌతాఫ్రికాతో రాంచీలో జరిగిన మొదటి వన్డేలో కూడా అదే జరిగింది. కోహ్లీ కేవలం 102 బంతుల్లోనే 100 పరుగులు పూర్తి చేసి, తన వన్డే కెరీర్‌లో 52వ సెంచరీని నమోదు చేశాడు. ఈ సెంచరీతో విరాట్ కోహ్లీ అద్భుతమైన చరిత్ర సృష్టించాడు. ఒకే ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు (52) చేసిన ఆటగాడిగా నిలిచాడు. దీని ద్వారా ఒక ఫార్మాట్‌లో 51 సెంచరీలు చేసిన దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మహారికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు.
విరాట్ కోహ్లీ రాంచీలో సాధించిన 52వ సెంచరీ, అతన్ని ప్రపంచ క్రికెట్‌లో అత్యంత అరుదైన రికార్డును అందించింది. ఒకే ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఈ సెంచరీతో కోహ్లీ ఖాతాలో వన్డేల్లో 52 సెంచరీలు చేరాయి. అంతకుముందు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరిట టెస్ట్ ఫార్మాట్‌లో 51 సెంచరీల రికార్డు ఉండేది. ఆ రికార్డును ఇప్పుడు కోహ్లీ వన్డే ఫార్మాట్‌లో అధిగమించాడు.
ఇప్పటికే 2023లో సచిన్ టెండూల్కర్ (49 వన్డే సెంచరీలు) రికార్డును అధిగమించి, వన్డే క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు (52) చేసిన బ్యాటర్‌గా కోహ్లీ నిలిచాడు. ఈ 37 ఏళ్ల స్టార్ బ్యాటర్, దక్షిణాఫ్రికాపై అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా కూడా సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు.
5⃣2⃣nd ODI HUNDRED in 📸📸 #TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank | @imVkohli pic.twitter.com/l8fcrGm45i
— BCCI (@BCCI) November 30, 2025
కోహ్లీ సౌతాఫ్రికా పై ఇప్పటివరకు 6 సెంచరీలు నమోదు చేశాడు. సచిన్ టెండూల్కర్ సౌతాఫ్రికా పై 57 వన్డే మ్యాచ్‌లలో ఐదు సెంచరీలు కొట్టగా, కోహ్లీ కేవలం 32 మ్యాచ్‌లలోనే ఆరు సెంచరీలు కొట్టి, సచిన్ రికార్డును అధిగమించాడు. కోహ్లీ ఈ మ్యాచ్‌లో మరో అరుదైన మైలురాయిని కూడా చేరుకున్నాడు.
కోహ్లీ సొంత మైదానంలో (భారత్‌లో) వన్డేల్లో అత్యధిక 50-ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతేకాకుండా, అంతర్జాతీయ క్రికెట్‌లో (అన్ని ఫార్మాట్లు కలిపి) స్వదేశంలో 100 సార్లు 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి భారతీయ ఆటగాడిగా కూడా కోహ్లీ ఘనత సాధించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




