
గత కొన్ని రోజులుగా జరుగుతున్న రూమర్లను నిజం చేస్తూ టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ టెస్టులకు వీడ్కోలు పలికాడు. తన రిటైర్మెంట్ గురించి విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో తెలియజేశాడు. ‘ సుమారు 14 ఏళ్ల క్రితం మొదటిసారి వైట్ జెర్సీ ధరించాను. ఈ ఫార్మాట్ లో నేను ఇంతకాలం కొనసాగుతానని అసలూ ఊహించలేదు. టెస్ట్ క్రికెట్ ఆడడం నాకు ఎప్పుడూ ప్రత్యేకమే. నాకెన్నో పరీక్షలు పెట్టి పాఠాలు నేర్పించింది. ఈ ఫార్మాట్ తో నాకెన్నో మధురమైన జ్ఞాపకాలు, అనుభవాలు ఉన్నాయి. అలాంటి ఈ టెస్ట్ క్రికెట్ ను వదిలేయడమనేది చిన్న విషయం కాదు. కానీ నా నిర్ణయం సరైందనే అనిపిస్తోంది. టెస్ట్ క్రికెట్ కు నేను ఎంతో చేశాను. అలాగే నేను ఆశించిన దానికంటే ఎక్కువే ఇది నాకు తిరిగిచ్చింది. మనసు నిండా సంతృప్తితో, కృతజ్ఞతాభావంతో దీన్ని నుంచి తప్పుకుంటున్నా. ప్రేమతో ఇక సైనింగ్ ఆఫ్’ అని కోహ్లీ తన రిటైర్మెంట్ సందేశంలో పేర్కొన్నాడు.
విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 123 టెస్టుల్లో 46.9 సగటుతో 9230 పరుగులు సాధించాడు. ఇందులో 30 సెంచరీలు 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 254 నాటౌట్. ఈ ఫార్మాట్ లో కోహ్లీ మరో 770 పరుగులు చేసి ఉంటే 10 వేల పరుగులు మైలురాయిని చేరుకునే వాడు. టెస్ట్ క్రికెట్ లో ఇప్పటివరకు మొత్తం ముగ్గురు భారతీయ క్రికెటర్లు మాత్రమే 10వేల పరుగుల మైలురాయిని అందుకున్నారు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సునీల్ గవాస్కర్ ఈ జాబితాలో ఉన్నారు. కోహ్లీ కూడా ఈ జాబితాలో చేరుతాడని క్రికెట్ అభిమానులు భావించారు. కానీ అంతుకు ముందే కింగ్ రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఇవి టెస్ట్ క్రికెట్ లో కింగ్ కోహ్లీ సాధించిన కొన్ని రికార్డులు మాత్రమే. ఇవి గాక ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక పరుగులు (1322), ఒక కెప్టెన్ చేసిన సిరీస్‌లో అత్యధిక పరుగులు (655), అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు (3), త్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు (10).. ఇలా చెప్పుకుంటూ పోతే కింగ్ కోహ్లీ రికార్డులపై ఒక పుస్తకమే రాయవచ్చు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..