ICC Rankings: రోహిత్‌కు భారీ షాకిచ్చిన కింగ్ కోహ్లీ.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మాజీ సారథి దూకుడు..

|

Mar 29, 2023 | 4:24 PM

ICC ODI Rankings: భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచేందుకు పావులు కదుపుతున్నాడు. కోహ్లి మరోసారి తన పాత స్టైల్‌కి తిరిగి వస్తున్నాడు. గత కొన్నేళ్లుగా పేలవ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ మళ్లీ పునరాగమనం చేస్తున్నాడు.

ICC Rankings: రోహిత్‌కు భారీ షాకిచ్చిన కింగ్ కోహ్లీ.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మాజీ సారథి దూకుడు..
Rohit Sharma Virat Kohli
Follow us on

ICC ODI Ranking Virat Kohli: భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచేందుకు పావులు కదుపుతున్నాడు. కోహ్లి మరోసారి తన పాత స్టైల్‌కి తిరిగి వస్తున్నాడు. గత కొన్నేళ్లుగా పేలవ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ మళ్లీ పునరాగమనం చేస్తున్నాడు. వన్డే ఫార్మాట్‌లో అతని ర్యాంకింగ్‌లో భారీగా దూసుకొచ్చాడు. ఆస్ట్రేలియాతో చెన్నైలో తన చివరి వన్డే ఆడాడు. ఈ మ్యాచ్‌లో అతను హాఫ్ సెంచరీ (54) చేశాడు. ఈ అర్ధ సెంచరీతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ఏడో ర్యాంక్‌కు చేరుకున్నాడు.

వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్-10 ప్లేయర్ల జాబితా నుంచి విరాట్ కోహ్లి కొంతకాలంగా బయటికి వచ్చాడు. అయితే ప్రస్తుతం టాప్ 10లోకి దూసుకొస్తున్నాడు. ప్రస్తుతం, కోహ్లీ వన్డే ర్యాంకింగ్‌లో 719 రేటింగ్‌లతో 7వ స్థానంలో ఉన్నాడు. కోహ్లీ టీమిండియా సారథి రోహిత్ శర్మను వెనక్కు నెట్టాడు. భారత కెప్టెన్ 707 రేటింగ్‌తో 8వ స్థానంలో ఉన్నాడు.

2023లో 2 వన్డే సెంచరీలు..

విరాట్ కోహ్లీకి 2023 సంవత్సరం చాలా కలిసివచ్చింది. అతను ఈ సంవత్సరం మొత్తం 9 ODIలు ఆడాడు. అందులో అతను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 53.37 సగటు, 116.03 స్ట్రైక్ రేట్‌తో 427 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌ల్లో అతని బ్యాట్‌ నుంచి 2 సెంచరీలు, 1 హాఫ్‌ సెంచరీ వచ్చాయి. ఇందులో అతని అత్యధిక స్కోరు 166 నాటౌట్.

ఇవి కూడా చదవండి

అదే సమయంలో కోహ్లి 2023లో ఇప్పటివరకు మొత్తం 13 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లో 15 ఇన్నింగ్స్‌ల్లో 51.71 సగటుతో 724 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, ఒక అర్ధ సెంచరీ సాధించాడు. అదే సమయంలో అతని అత్యధిక స్కోరు 186 పరుగులు.

ఇంటర్నేషనల్ కెరీర్..

కోహ్లీ తన అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటివరకు మొత్తం 108 టెస్టులు, 274 వన్డేలు, 115 టీ20లు ఆడాడు. అతను టెస్టుల్లో 28 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలతో 8416 పరుగులు, ODIలలో 46 సెంచరీలు, 65 అర్ధ సెంచరీలతో 12898 పరుగులు చేశాడు. టీ20 ఇంటర్నేషనల్స్‌లో 37 హాఫ్ సెంచరీలు, 1 సెంచరీ సహాయంతో 4008 పరుగులు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..