ట్రిపుల్ ఫిగర్ దగ్గర తడబడిన కోహ్లీ.. సచిన్ రికార్డు పదిలం.! మళ్లీ సెమీస్‌లోనే..

ట్రిపుల్ ఫిగర్ చేరుకోవడంలో మళ్లీ తడబడ్డాడు టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ. వాంఖడే స్టేడియం వేదికగా శ్రీలంకతో జరుగుతోన్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(88).. 12 పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు. సచిన్ టెండూల్కర్ ముందు 49 సెంచరీల మాస్టర్ బ్లాస్టర్ రికార్డును కోహ్లీ సమం చేస్తాడని అందరూ ఊహించారు

ట్రిపుల్ ఫిగర్ దగ్గర తడబడిన కోహ్లీ.. సచిన్ రికార్డు పదిలం.! మళ్లీ సెమీస్‌లోనే..
Virat Kohli 4

Updated on: Nov 02, 2023 | 6:33 PM

ట్రిపుల్ ఫిగర్ చేరుకోవడంలో మళ్లీ తడబడ్డాడు టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ. వాంఖడే స్టేడియం వేదికగా శ్రీలంకతో జరుగుతోన్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(88).. 12 పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు. సచిన్ టెండూల్కర్ ముందు 49 సెంచరీల మాస్టర్ బ్లాస్టర్ రికార్డును కోహ్లీ సమం చేస్తాడని అందరూ ఊహించారు. కానీ నైంటీస్ ఫీవర్ కోహ్లీని దెబ్బేసింది. వరుసగా మూడు మ్యాచ్‌లలో 95, 85, 88 పరుగులతో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించిన కోహ్లీ.. సెంచరీ చేయకుండా వెనుదిరిగాడు.

అయితేనేం ఒక రికార్డు మిస్ అయితే.. మరో రెండు రికార్డులు బద్దలు కొట్టాడు విరాట్ కోహ్లీ. వన్డే చరిత్రలోనే ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధికసార్లు 1000కి పైగా పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు 8 క్యాలెండర్ ఇయర్స్‌లో కోహ్లీ 1000కి పైగా పరుగులు చేశాడు. ఆ తర్వాత సచిన్ 7 క్యాలెండర్ ఇయర్స్‌లో వెయ్యికి పైగా పరుగులు చేయగా.. వీరిద్దరి తర్వాత సౌరవ్ గంగూలీ(6), కుమార సంగక్కర(6), రికీ పాంటింగ్(6), రోహిత్ శర్మ(4) ఉన్నారు. మరోవైపు శ్రీలంకపై 4 వేల పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. తద్వారా సచిన తర్వాత ఈ ఫీట్ సాధించిన బ్యాటర్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. సచిన్ 109 మ్యాచ్‌లలో 17 సెంచరీలు, 23 అర్ధ సెంచరీలతో శ్రీలంకపై 5108 పరుగులు చేశాడు. ఇక ఇప్పుడు విరాట్ కోహ్లీ లంకేయులపై 4 వేల పరుగులు పూర్తి చేశాడు.

మరిన్ని వరల్డ్‌కప్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..