
Virat Kohli Made Fun With Yashasvi Jaiswal: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌కు ముందు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గ్రౌండ్‌లో సందడి చేశాడు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ హెయిర్ స్టైల్ చూసి కోహ్లీ సరదాగా ఆటపట్టించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
మ్యాచ్ ప్రారంభానికి ముందు యశస్వి జైస్వాల్ హెయిర్ స్టైల్ ‘తేరే నామ్’ సినిమాలో సల్మాన్ ఖాన్ ‘రాధే’ పాత్రను పోలి ఉండడాన్ని కోహ్లీ గమనించాడు. దీంతో వెంటనే కోహ్లీ ఆ సినిమాలో సల్మాన్ ఖాన్ చేసే ప్రసిద్ధ డ్యాన్స్ స్టెప్పులను అనుకరిస్తూ జైస్వాల్‌ను ఆటపట్టించాడు.
కోహ్లీ చేసిన ఈ అల్లరిని చూసి పక్కనే ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్ వంటి ఇతర ఆటగాళ్ళు కూడా నవ్వు ఆపుకోలేకపోయారు.
ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన కనబరిచారు. 120 బంతుల్లో 135 పరుగులు (11 ఫోర్లు, 7 సిక్సర్లు) చేసి తన కెరీర్‌లో 83వ అంతర్జాతీయ శతకాన్ని నమోదు చేశారు. ఈ ప్రదర్శనకు గాను ఆయనకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.
Kohli trolling Jaiswal’s hairstyle with Salman’s dance in Tere naam 🤣 pic.twitter.com/V9jF1PccKK
— Gangadhar (@90_andypycroft) November 30, 2025
మరోవైపు యశస్వి జైస్వాల్ 16 బంతుల్లో 18 పరుగులు చేసి తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. కోహ్లీ శతకం కారణంగా భారత్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.
గ్రౌండ్‌లో సీరియస్‌గా ఉండే కోహ్లీ, ఇలా సరదాగా సహచర ఆటగాళ్లతో గడపడం అభిమానులకు ఎంతో సంతోషాన్నిచ్చింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..