Video: దేశాలు దాటినా ఆగని అభిమానం.. ఆస్ట్రేలియాలో విరాట్‌ను చూసేందుకు అభిమానులు ఏం చేశారంటే?

|

Nov 14, 2024 | 4:30 PM

India vs Australia: నవంబర్ 22 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ పెర్త్‌లో జరగనుంది. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తోన్న భారత ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు చెట్లు ఎక్కిమరీ పోటీపడ్డారు.

Video: దేశాలు దాటినా ఆగని అభిమానం.. ఆస్ట్రేలియాలో విరాట్‌ను చూసేందుకు అభిమానులు ఏం చేశారంటే?
Virat Kohli Video
Follow us on

నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం భారత బృందం అక్కడికి చేరుకుని కసరత్తులు చేస్తోంది. పెర్త్ పేస్, బౌన్స్‌ను అర్థం చేసుకోవడానికి ఆటగాళ్ళు WACA స్టేడియంలో ప్రతిరోజూ గంటల తరబడి నెట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. నవంబర్ 14 శుక్రవారం మరోసారి టీమిండియా ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్ స్టేడియానికి చేరుకున్నారు. ఈ సమయంలో, జట్టులోని సీనియర్ ఆటగాళ్లు, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా చాలా తీవ్రంగా ప్రాక్టీస్ చేయడం కనిపించింది.

గర్జన మొదలెట్టిన విరాట్, బుమ్రా..

టీమిండియా అధికారిక శిక్షణా సెషన్ నవంబర్ 12 మంగళవారం నుంచి ప్రారంభమైంది. దీని సంగ్రహావలోకనం శుక్రవారం కూడా కనిపించింది. మీడియా కథనాల ప్రకారం, పరుగుల కోసం ఇబ్బంది పడుతున్న విరాట్ పెర్త్ టెస్టుకు ముందు భీకరంగా బ్యాటింగ్ చేశాడు. ఫాస్ట్ బౌలర్ల ముందు దాదాపు అరగంట పాటు చెమటోడ్చి బ్యాట్ అంచుకు పదును పెట్టాడు.

ఇవి కూడా చదవండి

అతను పెర్త్ బౌన్స్‌ను సులభంగా ఎదుర్కోవడం కనిపించింది. ఫాస్ట్ బౌలర్ల ధాటికి అతనికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. అయితే, లెగ్ సైడ్‌లోని కొన్ని బంతులు అతని గ్లోవ్స్ అంచుకు తగలడం కనిపించింది. మరోవైపు ఆస్ట్రేలియా బౌన్సీ ట్రాక్‌పై బుమ్రా బౌలింగ్ చేసి అరగంట పాటు భారత బ్యాట్స్‌మెన్స్‌ను ఇబ్బంది పెట్టాడు.

విరాట్‌ను చూసేందుకు చెట్లు ఎక్కిన జనం..

విరాట్‌ కోహ్లి ప్రాక్టీస్‌ గురించి తెలుసుకున్న అభిమానులు అతడిని చూడాలని ఆరాటపడ్డారు. ఇటువంటి పరిస్థితిలో చాలా మంది అభిమానులు అతనిని చూడటానికి నిచ్చెనలు వేసుకుని చెట్లు ఎక్కిమరీ చూసేందుకు పోటీ పడ్డారు. ప్రాక్టీస్ ప్రాంతం నల్లటి క్లాత్‌తో కప్పబడి ఉందని ఆస్ట్రేలియా మీడియా పేర్కొంది. భారత జట్టు కోరిక మేరకు ఇది జరిగింది.

గాయపడిన సర్ఫరాజ్..

ప్రాక్టీస్ సెషన్‌లో జస్‌ప్రీత్ బుమ్రా, విరాట్ కోహ్లీతో పాటు, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్‌లతో సహా ఇతర భారత ఆటగాళ్లు కూడా కనిపించారు. ప్రాక్టీస్ సమయంలో భారత జట్టుకు ఆందోళన కలిగించే విషయం ఒకటి చోటు చేసుకుంది. అది సర్ఫరాజ్ ఖాన్ గాయం కావడం గమనార్హం. ఎందుకంటే, అతను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు గాయపడ్డాడంట. ఆ తర్వాత అతను మోచేయి పట్టుకుని వెళ్లిపోవడం కనిపించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..