Ind Vs Nz: ఐపీఎల్‌లో గొడవకి ఆ అంపైర్ ఇప్పుడు పగ తీర్చుకున్నాడా..? లేకపోతే ఇది ఔట్ ఏంటి..?

|

Dec 04, 2021 | 8:39 AM

ముంబై టెస్టు తొలి రోజే వివాదం రాజుకుంది. దీనికి కారణం థర్డ్‌ అంపైర్‌ తీసుకున్న వివాదాస్పద నిర్ణయమే. నాటౌట్‌ని.. ఔట్‌గా ప్రకటించి ఇరుక్కున్నాడు.

Ind Vs Nz: ఐపీఎల్‌లో గొడవకి ఆ అంపైర్ ఇప్పుడు పగ తీర్చుకున్నాడా..? లేకపోతే ఇది ఔట్ ఏంటి..?
Virat Kohli Out
Follow us on

కివీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు 80కే రెండు వికెట్లు కోల్పోయింది భారత్‌. ఓపెనర్‌ గిల్‌, ఫస్ట్‌ డౌన్‌లో వచ్చిన పుజారా వెంట వెంటనే ఔటవ్వడంతో.. క్రీజులోకొచ్చాడు విరాట్‌ కోహ్లీ. అజాజ్‌ వేసిన 30వ ఓవర్లో.. మూడు బంతులు ఎదుర్కొన్న తర్వాత నాలుగో బంతిని కూడా డిఫెండ్‌ చేశాడు కోహ్లీ. ఆసమయంలో బంతి ప్యాడ్లకు తగలడంతో అంపైర్‌ ఔటిచ్చాడు. దీనిపై రివ్యూకి వెళ్లాడు విరాట్‌ కోహ్లీ. రివ్యూల్లో బంతి బ్యాట్‌కు తాకుతూ.. ప్యాడ్లకు తాకినట్లు స్పష్టంగా కనిపించింది. దీంతో గ్రౌండ్‌లో ఉన్న కోహ్లీతోపాటు.. టీమిండియా అభిమానులంతా నాటౌటే అనుకున్నారు. కాని థర్డ్‌ అంపైర్‌ వీరేందర్‌ శర్మ.. బంతి బ్యాట్‌, ప్యాడ్‌ మధ్యలో ఉంది ఎలాంటి నిర్ణయం తేల్చుకోలేకపోతున్నా.. ఒరిజినల్‌ డెసిషన్‌తోనే వెళ్లమని గ్రౌండ్‌ అంపైర్‌కి చెప్పాడు. దీంతో ఔట్‌గా ప్రకటించాడు ఆన్‌ఫీల్డ్‌ అంపైర్‌. దీంతో కోహ్లీ అసహనంతోనే ఫీల్డ్‌ వదిలాడు.

థర్డ్‌ అంపైర్‌ వీరేందర్‌ శర్మపై టీమిండియా ఫ్యాన్స్‌ విపరీతమైన ట్రోల్స్‌ చేస్తున్నారు. ఇటీవల జరిగిన IPL లో అంపైర్‌ వీరేందర్‌ శర్మతో కోహ్లీ గొడవపడడం వల్లే.. ఇప్పుడు పగ తీర్చుకున్నాడంటున్నారు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో త్రిపాటి వికెట్‌ విషయంలో వీరేందర్‌ శర్మతో వాగ్వాదానికి దిగాడు కోహ్లీ. అది మనసులో పెట్టుకుని.. ఇప్పుడు కోహ్లీని ఔట్‌ చేశాడంటూ ట్రోల్స్‌ చేస్తున్నారు ఫ్యాన్స్‌.

అయితే ఇప్పుడు కోహ్లీ వికెట్ విషయంలో.. ఆ బంతి క్లియర్‌గా బ్యాట్‌ ఎడ్జ్‌ తాకి.. ప్యాడ్లను తాకినట్లు తెలుస్తున్నా.. థర్డ్‌ అంపైర్‌ వీరేందర్‌ శర్మ ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోయాడో ఆయనకే తెలియాలి. టీ విరామం తర్వాత అంపైర్లు ఫీల్డ్‌లోకి వస్తున్న సమయంలో స్టాన్స్‌లో ఉన్న ఫ్యాన్స్‌ వారిని గేలి చేస్తూ ఈలలేశారు.

మరోవైపు ఇది.. ఔటో, నాటౌటో చెప్పాలంటూ బీసీసీఐ పోల్ నిర్వహిస్తుంది. ఈ మేరకు ట్విట్టర్ ఖాతాలో వీడియో షేర్ చేసింది.

Also Read: Viral Photo: ఈ ఫోటోలో ఓ పాము దాగుంది.. కనిపెట్టండి చూద్దాం

తుఫాన్ ప్రభావం ఉండే జిల్లాలకు అందుబాటులో పది కోట్ల నిధులు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు