Ayodhya Ram Mandir: అయోధ్య ఆహ్వానం అందుకున్న విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ..

| Edited By: Venkata Chari

Jan 16, 2024 | 7:22 PM

Pran Pratishtha Ceremony: జనవరి 16 నుంచి జనవరి 22 వరకు ఈ కార్యక్రమాలు జరుగునున్నాయి. 22న జరిగే ప్రాణ ప్రతిష్ట పూజా కార్యక్రమం నిర్వహణ మొత్తం లక్ష్మీకాంత్ దీక్షితులు నిర్వహించనున్నారు. ఇక సౌత్ నుంచి చిరంజీవి, రామ్ చరణ్, రజినీకాంత్, మోహన్లాల్, ధనుష్, కాంతారా స్టార్ రిషబ్ శెట్టి, ప్రొడ్యూసర్ మహావీర్ జైన్ లకు అయోధ్య ఆహ్వానం అందించారు.

Ayodhya Ram Mandir: అయోధ్య ఆహ్వానం అందుకున్న విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ..
Virat Kohli Ayodhya Ram Man
Follow us on

Virat Kohli, Anushka Sharma: అయోధ్య శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట వేడుకకు ఇండియన్ స్టార్ బ్యాట్‌మెన్స్ విరాట్ కోహ్లీకి ఆహ్వానం అందింది. ఈనెల 22న అయోధ్యలో జరిగే శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు పలువురు దిగ్గజాలకు ఆహ్వానాలు అందిస్తున్న విషయం తెలిసిందే. అయోధ్యకు ఆహ్వానం అందుకున్న వారిలో రాజకీయ నాయకుల నుంచి మొదలుపెట్టి సినిమా తారలు క్రికెటర్లు స్పోర్ట్స్ పర్సనాలిటీలు వరకు ఈ ఆహ్వానాన్ని అందజేస్తున్నారు. రామ మందిర ప్రతిష్టాపన వేడుకలకు ఆహ్వానం అందుకున్న క్రికెటర్లలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి , ఎంఎస్ ధోని ఉన్నారు. ఆర్ఎస్ఎస్ లీడర్ ధనుంజయ సింగ్ చేతుల మీదుగా స్పోర్ట్స్ స్టార్ లకు అయోధ్య ఆహ్వానాన్ని అందించారు. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తరపున ఈ ఆహ్వానాలను ప్రముఖులకు అందిస్తున్నారు.

ఇంకా ఆహ్వానం అందుకున్న బాలీవుడ్ సెలబ్రిటీలలో అక్షయ్ కుమార్, కంగనా రనౌత్, టైగర్ షర్ఫ్, అమితాబ్, రన్బీర్ , అలియా భట్, రణదీప్ హూడ ఉన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాలలో ప్రాముఖ్యం చాటుకున్న ప్రతిభావంతులకు ఈ ఆహ్వానాన్ని అందిస్తున్నారు. 22న ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి విచ్చేస్తున్న అతిధుల కోసం ప్రత్యేక బహుమతులను సైతం రామ జన్మభూమి ట్రస్ట్ సభ్యులు సిద్ధం చేసినట్టు సమాచారం.

దేశవ్యాప్తంగా 11 వేల అతిధులకు అయోధ్య ఆహ్వానాన్ని అందించనున్నారు. రామ్ రాజ్ పేరుతో ప్రత్యేక బహుమతులను అతిధుల కోసం సిద్ధం చేశారు. అయోధ్యలో ఈరోజు నుంచి రోజువారి పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఈరోజు సరయు ఘాట్ వద్ద హారతి కార్యక్రమంతో ఏ ప్రారంభమవుతుంది.

జనవరి 16 నుంచి జనవరి 22 వరకు ఈ కార్యక్రమాలు జరుగునున్నాయి. 22న జరిగే ప్రాణ ప్రతిష్ట పూజా కార్యక్రమం నిర్వహణ మొత్తం లక్ష్మీకాంత్ దీక్షితులు నిర్వహించనున్నారు. ఇక సౌత్ నుంచి చిరంజీవి, రామ్ చరణ్, రజినీకాంత్, మోహన్లాల్, ధనుష్, కాంతారా స్టార్ రిషబ్ శెట్టి, ప్రొడ్యూసర్ మహావీర్ జైన్ లకు అయోధ్య ఆహ్వానం అందించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..