Virat Kohli: కింగ్‌ కోహ్లీ ఆశలపై నీళ్లు చల్లిన బీసీసీఐ.. వందో టెస్ట్‌ వేదిక బెంగళూరు నుంచి మరొక చోటుకు..

|

Feb 15, 2022 | 8:14 PM

తననెంతో అభిమానించే బెంగళూరు (Bangalore) ప్రేక్షకుల సమక్షంలో వందో టెస్టును ఆడి చిరస్మరణీయంగా మార్చుకోవాలనుకున్న విరాట్ కోహ్లీ (Virat Kohli) కి బీసీసీఐ షాక్‌ ఇచ్చింది.

Virat Kohli: కింగ్‌ కోహ్లీ ఆశలపై నీళ్లు చల్లిన బీసీసీఐ.. వందో టెస్ట్‌ వేదిక బెంగళూరు నుంచి మరొక చోటుకు..
Virat Kohli
Follow us on

తననెంతో అభిమానించే బెంగళూరు (Bangalore) ప్రేక్షకుల సమక్షంలో వందో టెస్టును ఆడి చిరస్మరణీయంగా మార్చుకోవాలనుకున్న విరాట్ కోహ్లీ (Virat Kohli) కి బీసీసీఐ షాక్‌ ఇచ్చింది. ఈ నెల చివర్లో స్వదేశంలో ప్రారంభమయ్యే శ్రీలంక టూర్​షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ను బీసీసీఐ మార్చింది. ముందుగా అనుకున్న షెడ్యూల్​ ప్రకారం మొదటగా రెండు టెస్టులు బెంగళూరు, మొహాలీలో జరగాలి. దీని ప్రకారం ఇప్పటికే 99 టెస్టులు పూర్తి చేసుకున్న కోహ్లీ వందో టెస్టు మ్యాచ్‌ బెంగళూరు వేదికగానే జరుగుతుందని భావించారు అభిమానులు. అయితే లంక క్రికెట్‌ బోర్డు అభ్యర్థన మేరకు మొదట టీ-20 సిరీస్‌, ఆతర్వాతే టెస్ట్‌ మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐ (BCCI) నిర్ణయించింది. ఈమేరకు ముందు ప్రకటించిన షెడ్యూల్‌లో మార్పులు చేసింది.

కొత్త షెడ్యూల్‌ ప్రకారం ఫిబ్రవరి 24న లక్నో వేదికగా టీ 20 మ్యాచ్‌తో శ్రీలంక టూర్‌ ప్రారంభమవుతోంది. ఆతర్వాత ధర్మశాల వేదికగా రెండు, మూడు టీ 20 మ్యాచ్‌లు జరుగుతాయి. అక్కడి నుంచి రెండు జట్లు‌‌‌‌‌‌‌ మొహాలీకి వెళ్తాయి. మొదటి‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌ (మార్చి 3–7) అక్కడే జరగనుండగా, రెండో డే నైట్ టెస్ట్‌ మ్యాచ్‌ ‌‌‌‌(మార్చి12–16) బెంగళూరు వేదికగా జరగనుంది. ఈక్రమంలో సొంత ఫ్యాన్స్‌ సమక్షంలో వందో టెస్ట్‌ ఆడాలన్న కోహ్లీ ఆశలపై బీసీసీఐ నీళ్లు చల్లినట్లయింది. కాగా ఐపీఎల్‌లో కోహ్లీ బెంగళూర్‌ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ టీంతో అతనికి 14 ఏళ్లుగా అటాచ్‌మెంట్ ఉంది. మొన్నటి సీజన్‌ వరకు విరాటే బెంగళూరు జట్టుకు నాయకత్వం వహించాడు కూడా. ఈ క్రమంలో బెంగళూరులోనే విరాట్‌ తన వందో టెస్ట్‌ ఆడాలని అతని అభిమానులు ఆశించారు. అయితే బీసీసీఐ మాత్రం తొలి టెస్టును మొహాలీ వేదికగా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడంతో కోహ్లీ ఫ్యాన్స్‌కి నిరాశే ఎదురైంది. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత వన్డే కెప్టెన్సీ నుంచి బలవంతంగా తొలగించి, కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకోవడానికి కూడా కారణమైన బీసీసీఐ, విరాట్‌కి అన్ని విధాలుగా చెక్ పెట్టేందుకు టెస్టు వేదికలను మార్చిందని కోహ్లీ అభిమానులు అంటున్నారు.

Also Read:Viral Video: ఫుల్లుగా తాగి అర్ధరాత్రి పోలీసులకు ఫోన్‌ చేసిన ఘనుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Kurnool: న్యాయం కావాలంటూ పాతిపెట్టిన కూతురు మృతదేహాన్ని వెలికితీయాలన్న తండ్రి.. అడ్డుకున్న పోలీసులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Dhanashree Verma: తల్లితో కలిసి కచా బాదం పాటకు కాలు కదిపిన చాహల్‌ సతీమణి.. నెటిజన్లను ఆకట్టుకుంటోన్న వీడియో..