Virat And Williamson: విల‌య‌మ్‌స‌న్‌ను విరాట్ కోహ్లీ అవుట్ చేసిన వేళ‌.. వైర‌ల్ అవుతోన్న 2008 నాటి వీడియో..

|

Jun 15, 2021 | 6:00 AM

Virat And Williamson: ప్ర‌పంచ దిగ్గ‌జ బ్యాట్స్‌మెన్‌ల‌లో ముందు వ‌రుస‌లో ఉండే వారిలో ఒక‌రు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అయితే మ‌రొక‌రు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియ‌మ్‌స‌న్‌. వీరిద్ద‌రి మ‌ధ్య నిత్యం పోటీ ఉంటుంది...

Virat And Williamson: విల‌య‌మ్‌స‌న్‌ను విరాట్ కోహ్లీ అవుట్ చేసిన వేళ‌.. వైర‌ల్ అవుతోన్న 2008 నాటి వీడియో..
Virat Throw Back Video
Follow us on

Virat And Williamson: ప్ర‌పంచ దిగ్గ‌జ బ్యాట్స్‌మెన్‌ల‌లో ముందు వ‌రుస‌లో ఉండే వారిలో ఒక‌రు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అయితే మ‌రొక‌రు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియ‌మ్‌స‌న్‌. వీరిద్ద‌రి మ‌ధ్య నిత్యం పోటీ ఉంటుంది. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్న ఐసీసీ వ‌రల్డ్ టెస్ట్‌ ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్‌పై అంద‌రి దృష్టి ప‌డింది. ఈ ఇద్ద‌రు ఆట‌గాళ్లు ఎదురు ప‌డుతుండ‌డంతో ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ నేప‌థ్యంలోనే ఇద్ద‌రు దిగ్గ‌జ ఆట‌గాళ్లు మ‌ధ్య జ‌రిగిన ఓ సంఘ‌ట‌న‌కు సంబంధించి వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.
కోహ్లీ, విలియ‌మ్ స‌న్ కెప్టెన్లుగా తొలిసారి పోటీ ప‌డ్డది 2008లో. అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భాగంగా వీరిద్ద‌రు త‌మ జ‌ట్టుల‌కు సార‌థులుగా వ్య‌వ‌హ‌రించారు. ఆ స‌మ‌యంలో జ‌రిగిన సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బౌలింగ్‌కు దిగాడు. అదే స‌మ‌యంలో క్రీజులో న్యూజిలాండ్ కెప్టెన్ విలియ‌మ్‌స‌న్ క్రీజులో ఉన్నాడు. విరాట్ వేసిన బంతికి ముందుకు వ‌చ్చి షాట్ ఆడ‌డానికి ప్ర‌య‌త్నించిన విలియ‌మ్ స‌న్ స్టంప‌వుట్ రూపంలో వెనుదిరిగాడు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో వ‌ర్షం కార‌ణంగా భార‌త్ డీఎల్ఎస్ విధానంలో గెలుపొందింది. నిజానికి విరాట్ ఫుల్ టైమ్ బౌల‌ర్ కాక‌పోయిన‌ప్ప‌టికీ అండర్ 19 స‌మ‌యాల్లో బౌల‌ర్ అవ‌తార‌మెత్తాడు. ఇక తాజాగా టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ కోసం చేస్తోన్న ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో కూడా విరాట్ బౌలింగ్ వేశాడు. ప్రస్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారిన 13 ఏళ్ల క్రితం వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

Also Read: Viral Video: గేటు ముందు పార్కింగ్ చేసిన కారు.. ఆగ్రహించిన రైతు.. ఊహించని రీతిలో షాక్ ఇచ్చాడు.. ఏకంగా.. 

థర్డ్ కోవిద్ ముప్పు భయం…..ఢిల్లీలో సొంత ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటున్న ప్రైవేటు ఆసుపత్రులు

Jaganna Vidya Kanuka: జగనన్న విద్యా కానుక కిట్ లో మరో సర్‌ప్రైజ్.. AP సర్కారు నిర్ణయం