Viral Video: మ్యాచ్‌లో లవ్ ప్రపోజల్.. భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న ప్రేయసి..! నెట్టింట్లో ఆకట్టుకుంటోన్న జిల్, ఫిల్ వీడియో

|

Jul 22, 2021 | 6:51 AM

ఆటల్లో లవ్ ప్రపోజల్స్ మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాం. అయితే, తాజగా ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌ టీంల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌ సందర్భంగా ఇలాంటి ఓ సన్నివేశం వ్యూవర్స్‌తోపాటు నెటిజన్లను ఆకట్టుకుంది.

Viral Video:  మ్యాచ్‌లో లవ్ ప్రపోజల్.. భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న ప్రేయసి..! నెట్టింట్లో ఆకట్టుకుంటోన్న జిల్, ఫిల్ వీడియో
Love Proposal In Eng Vs Pak Match
Follow us on

Eng vs Pak: ఆటల్లో లవ్ ప్రపోజల్స్ మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాం. అయితే, తాజగా ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌ టీంల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌ సందర్భంగా ఇలాంటి ఓ సన్నివేశం వ్యూవర్స్‌తోపాటు నెటిజన్లను ఆకట్టుకుంది. ఓ వైపు మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. ఇలాంటి సమయంలో ఓ వ్యక్తి తన లవర్‌కి 22వేల మంది ముందు ప్రపోజ్‌ చేసేశాడు. టీవీ స్క్రీన్‌పై కూడా వీరి ప్రపోజల్ సీన్ లైవ్ అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆశ్చర్యంతో పాటు భావోద్వేగానకి గురైన అతడి ప్రేయసి, ఒకే చెప్పేసింది. అలాగే ఆమె లవర్ ఇచ్చిన ఉంగరం తీసుకుని ఆనందభాష్పాలను రాల్చింది. వారి చుట్టూ ఉన్న ప్రేకక్షులతో పాటు స్డేడియంలో ఉన్న వారంతా చప్పట్లతో వారి ప్రేమకు శుభాకాంక్షలు తిలిపారు. కొంతమంది ఏకంగా వారి వద్దకు వచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాంటి ఊహించని సీన్‌కి కామెంటేటర్‌ డేవిడ్‌ లాయిడ్‌ అద్భుతంగా కామెంట్రీ చేశాడు. ‘‘హేయ్‌… అక్కడ ఏం జరుగుతోంది? జిల్‌, ఫిల్‌.. అంటూ తన స్టైల్‌లో అదరగొట్టాడు. దీనికి ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. జిల్, ఫిల్ అంటూ వారు కూడా తమ శుభాకాంక్షలు తెలిపారు.

క్రికెట్ కామెంట్రీ లాగే చెప్పుకొచ్చాడు. అతడు లవ్ ప్రపోజ్ చేయగానే, ఇప్పుడే అప్పీల్ చేశాడు, డెసిషన్ పెండింగ్‌లో ఉంది ఓహో ఆమె ఓకే చెప్పేసింది.. జిల్, ఫిల్ అంటూ కామెంట్రీ చేశాడు. కాగా, ఈ వీడియోనను ఇంగ్లండ్‌ క్రికెట్‌ ట్విటర్‌లో పంచుకుంది. చివరిదైన మూడో టీ20లో ఇంగ్లండ్ జట్టు విజయం సాధించింది. దీంతో 2-1 తేడాతో టీ20 సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచులో జాసన్‌ రాయ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

Also Read:

Tokyo Olympics 2021: బోపన్నపై వేటు పడనుందా.. మరింత ముదిరిన ఐటా వివాదం.. డేవిస్‌ కప్‌లో డౌటే?

ఇతడి వల్లే ఇంగ్లండ్ రికార్డ్ స్కోర్.. మాములు బ్యాట్స్‌మెన్ కాదు కదా..! ఆసీస్ బౌలర్లను ఇరగదీశాడు