Video: వికెట్ తీసిన ఆనందంలో వింత సెలబ్రేషన్స్.. ఏకంగా బ్యాటర్ చెంతకు వెళ్లి.. వైరల్ వీడియో

LSG vs PBKS: లక్నోలోని ఎకానా స్టేడియంలో, పంజాబ్ 172 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16.2 ఓవర్లలో 2 వికెట్లకు చేరుకుంది. శ్రేయాస్ అయ్యర్ 52 పరుగులతో, నేహాల్ వధేరా 43 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 34 బంతుల్లో 69 పరుగులు చేశాడు. లక్నో బౌలర్ దిగ్వేష్ రతి 2 వికెట్లు పడగొట్టాడు.

Video: వికెట్ తీసిన ఆనందంలో వింత సెలబ్రేషన్స్.. ఏకంగా బ్యాటర్ చెంతకు వెళ్లి.. వైరల్ వీడియో
Digvesh Rathi Celebration Priyansh Arya Wicket

Updated on: Apr 02, 2025 | 6:42 AM

Digvesh Rathi Celebration Priyansh Arya Wicket: ఐపీఎల్ (IPL) 2025లో భాగంగా 13వ మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్‌లో ఢిల్లీకి చెందిన ఇద్దరు ప్లేయర్ల మధ్య హీట్ వెదర్ కనిపించింది. ఢిల్లీకి చెందిన ప్రియాంష్ ఆర్య, దిగ్వేష్ రతి మధ్య జరిగిన ఈ వివాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. లక్నో లెగ్ స్పిన్నర్ దిగ్వేష్ మూడో ఓవర్లో ప్రశాంత్ ఆర్యను అవుట్ చేసిన వెంటనే విచిత్రంగా సెలబ్రేట్ చేసుకోవడం మొదలుపెట్టాడు. ఈ వేడుక చూస్తుంటే విరాట్ కోహ్లీ, కేస్రిక్ విలియమ్స్ మధ్య జరిగిన సీన్ గుర్తుకు తెచ్చింది. ప్రియాంష్, దిగ్వేష్ మధ్య అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

దిగ్వేష్-ప్రియాన్ష్ మధ్య ఏం జరిగింది?

దిగ్వేష్ తన అద్భుతమైన బౌలింగ్‌తో ప్రియాంష్‌ను ట్రాప్ చేశాడు. ప్రియాంష్ భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ, బంతి గాల్లోకి లేవడంతో శార్దూల్ ఠాకూర్ ఈజీ క్యాచ్ అందుకున్నాడు. ఆ తరువాత దిగ్వేష్ తన సహచరులతో సెలబ్రేషన్ చేసుకునే బదులు, దిగ్వేష్ ప్రియాంష్ వైపు పరిగెత్తి తన చేతిలో ఏదో రాస్తూ హీట్ పెంచాడు. ప్రియాంష్ అతనికి సమాధానం కూడా ఇవ్వకుండా ముందుకుసాగాడు. దిగ్వేష్ ఇలా ఎందుకు చేశాడో తెలియదు. కానీ ఢిల్లీ ప్రీమియర్ లీగ్ సమయం నుంచి ఈ ఇద్దరు ఆటగాళ్లు ఒకరినొకరు ట్రోల్ చేసుకుంటున్నారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వరుసగా రెండో విజయం..

ఐపీఎల్ 2025లో తమ అద్భుతమైన ప్రదర్శనతో పంజాబ్ కింగ్స్ మరోసారి అభిమానుల హృదయాలను గెలుచుకుంది. కెప్టెన్ మారిన వెంటనే పంజాబ్ జట్టు వైఖరి కూడా మారిపోయింది. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ ఇన్నింగ్స్, ప్రభ్‌సిమ్రాన్ అద్వితీయ అర్ధ సెంచరీ బలంతో, పంజాబ్ కింగ్స్ లక్నో సూపర్‌జెయింట్స్‌ను వాళ్ల సొంత మైదానంలోనే ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 171 పరుగులు చేసింది. పంజాబ్ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. పంజాబ్ ఈ లక్ష్యాన్ని కేవలం 16.2 ఓవర్లలోనే సాధించింది. ఈ సమయంలో పంజాబ్ 11 సిక్సర్లు, 16 ఫోర్లు కొట్టింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..