AFG vs NZ: భారత్ చేరిన వెంటనే న్యూజిలాండ్ బిగ్ స్కెచ్.. బ్యాటింగ్ కోచ్‌గా మనోడినే దింపారుగా

|

Sep 06, 2024 | 1:00 PM

Vikaram Rathour and Rangana Herath, New Zeland Team: న్యూజిలాండ్ క్రికెట్ జట్టు ప్రస్తుతం భారత పర్యటనలో ఉంది. గ్రేటర్ నోయిడాలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో నిర్వహించే ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 9 నుంచి 13 వరకు జరగనుంది. ఆసియాకు వచ్చిన తర్వాత, న్యూజిలాండ్ ఇద్దరు వెటరన్ కోచ్‌లను తన జట్టులో భాగంగా చేసుకుంది.

AFG vs NZ: భారత్ చేరిన వెంటనే న్యూజిలాండ్ బిగ్ స్కెచ్.. బ్యాటింగ్ కోచ్‌గా మనోడినే దింపారుగా
Vikaram Rathour And Rangana
Follow us on

Vikaram Rathour and Rangana Herath, New Zeland Team: న్యూజిలాండ్ క్రికెట్ జట్టు ప్రస్తుతం భారత పర్యటనలో ఉంది. గ్రేటర్ నోయిడాలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో నిర్వహించే ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 9 నుంచి 13 వరకు జరగనుంది. ఆసియాకు వచ్చిన తర్వాత, న్యూజిలాండ్ ఇద్దరు వెటరన్ కోచ్‌లను తన జట్టులో భాగంగా చేసుకుంది.

కివీ జట్టు ఆసియాలో రాబోయే మూడు టెస్టు మ్యాచ్‌లను దృష్టిలో ఉంచుకుని శ్రీలంక మాజీ స్పిన్నర్ రంగనా హెరాత్‌ను స్పిన్ బౌలింగ్ కోచ్‌గా నియమించింది. అతను సక్లైన్ ముస్తాక్ స్థానంలో వచ్చాడు. టెస్టుల్లో 433 వికెట్లతో హెరాత్ టెస్టు ఫార్మాట్‌లో అత్యంత అనుభవజ్ఞుడైన స్పిన్నర్‌లలో ఒకడిగా నిలిచాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో టెస్టు మ్యాచ్‌ ఆడిన తర్వాత న్యూజిలాండ్‌ శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌ ఆడాల్సి ఉంది. బ్లాక్‌క్యాప్‌లు అక్కడి దేశవాళీ బౌలర్‌ను తమ జట్టులో భాగంగా చేసుకోవడానికి ఇదే కారణం అంటున్నారు.

ఇవి కూడా చదవండి

న్యూజిలాండ్ బ్యాటింగ్ కోచ్‌గా విక్రమ్ రాథోడ్‌..

నోయిడాలో జరగనున్న టెస్ట్ మ్యాచ్ కోసం న్యూజిలాండ్ తన జట్టులో టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్‌ను కూడా చేర్చుకుంది. ఇటీవలే టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా రాథోడ్ పదవీకాలం ముగిసింది. టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్‌ను భారత్ గెలుచుకోవడంలో అతను కీలక పాత్ర పోషించాడు.

హెరాత్‌, రాథోడ్‌లు జట్టుకు కొత్త సమాచారాన్ని అందించడమే కాకుండా దేశీయ పరిస్థితులపై కూడా అవగాహన కల్పిస్తారని బ్లాక్‌క్యాప్స్ కోచ్ గ్యారీ స్టెడ్ అన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. హెరాత్‌, రాథోడ్‌లు మా టెస్ట్ గ్రూప్‌లో చేరినందుకు చాలా సంతోషిస్తున్నాం. ఇద్దరు ఆటగాళ్లు క్రికెట్ ప్రపంచంలో ఎంతో గౌరవం ఉంది. మా ఆటగాళ్లు వారి నుంచి నేర్చుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. ఉపఖండంలో మూడు టెస్టు మ్యాచ్‌ల్లో రంగనాతో కలిసి పనిచేసే అవకాశం రావడం మా ముగ్గురు ఎడమచేతి ఆర్థోడాక్స్ స్పిన్నర్లకు, ముఖ్యంగా ఇజాజ్, మిచ్, రాచిన్‌లకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. గాలెలో టెస్టు ఫార్మాట్‌లో రంగనా 100కు పైగా వికెట్లు పడగొట్టాడు. మా జట్టు ఈ మైదానంలో రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడుతుంది. అందువల్ల ఆ పిచ్‌పై అతని పరిజ్ఞానం అమూల్యమైనది’ అంటూ చెప్పుకొచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..