మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎంసీజీ) వేదికగా జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టులో టీమిండియా బ్యాట్స్‌మెన్ నితీశ్ కుమార్ రెడ్డి సెంచరీ సాధించాడు. ఈ అద్భుతమైన సెంచరీపై అటు సీనియర్ ఆటగాళ్లు, క్రికెట్ విశ్లేషకులు ప్రశంసలు కురిపించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో నితీష్‌కి ఇదే తొలి సెంచరీ. అయితే ఓవైపు నితీష్ రెడ్డి సెంచరీ చేస్తున్న సంగతి అటుంచితే.. గతంలో ఒక మ్యాచ్‌లో అతడు 5 పరుగులకే ఔటయ్యాడు. ఇంతకీ ఆ మ్యాచ్ ఎప్పుడు జరిగింది.? ఏ టోర్నీలో జరిగిందో ఇప్పుడు తెలుసుకుందామా..
గతంలో జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో పుదుచ్చేరి, హైదరాబాద్ జట్లు అహ్మదాబాద్‌లోని గుజరాత్ కాలేజ్ గ్రౌండ్‌లో తలపడ్డాయి. మ్యాచ్‌లో నితీష్ రెడ్డి తక్కువ పరుగులకే అవుట్ అయ్యాడు. హైదరాబాద్‌కు ఓపెనింగ్‌కి వచ్చిన అతడు కేవలం నాలుగు బంతులు ఎదుర్కొని ఐదు పరుగుల వద్ద క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో నితీష్ రెడ్డితో పాటు స్టార్ ప్లేయర్ తిలక్ వర్మ కూడా ఫ్లాప్ అయ్యాడు. ఈ ఏడాది టీ-20లో దక్షిణాఫ్రికాపై టీమ్ ఇండియా తరఫున రెండు బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు సాధించిన తిలక్.. పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో అద్భుతాలు చేయలేకపోయాడు. అతని బ్యాట్ నుంచి 7 బంతుల్లో 6 పరుగులు మాత్రమే వచ్చాయి. ఇంతకు ముందు ఇదే టోర్నీలో తిలక్ వర్మ రెండుసార్లు 0 పరుగులకే అవుట్ అయిన సంగతి తెలిసిందే.
తిలక్, నితీష్‌లు బ్యాటింగ్ చేయకపోయినా.. హైదరాబాద్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పుదుచ్చేరి జట్టు 31.5 ఓవర్లు ఆడి 98 పరుగులకే కుప్పకూలింది. సంతోష్ రత్నపార్ఖే అత్యధికంగా 26 పరుగులు చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో చామ మిలింద్ 5 వికెట్లు, తనయ్ త్యాగరాజన్ మూడు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కొడిమెల హిమతేజ అజేయంగా 42 పరుగులు చేశాడు. పుదుచ్చేరి తరఫున గౌరవ్ యాదవ్, ఫాబిద్ అహ్మద్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
ఇది చదవండి: 66 ఫోర్లు, 43 సిక్సర్లతో 815 పరుగులు.. బ్యాట్‌తో పూనకాలు తెప్పించేశారుగా.. ఆ ప్లేయర్లు ఎవరంటే.?
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..